కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి, ఆయన అల్లుడు.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
Malla Reddy: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎంపీ.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్

Malla Reddy: తెలంగాణలో ఎన్నికల పండుగ ముగిసి.. ఆ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పగ్గాలను చేజిక్కించుకుంది. ఎవరు ఊహించని రీతిలో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించారు. ఇదిలా ఉంటే రెండు స్థానాల్లో పోటీ చేసిన మాజీ సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి చవిచూసి.. గజ్వేల్ లో విజయకేతనం ఎగరవేశారు.

ప్రస్తుతం తెలంగాణలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈరోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తమ పార్టీ మాజీ మంత్రులు, గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. తదుపరి కార్యాచరణపై వారి చర్చించారు. అయితే ఈ సమావేశానికి ముగ్గురు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.. ఈ క్రమంలో వారు పార్టీ మారుతున్నారనే ప్రచారానికి బలం చేకూరినట్లైంది.

ALSO READ: BIG BREAKING: రాత్రి 7 గంటలకు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈరోజు కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి అటెండ్ కాలేదు. అయితే మల్లారెడ్డి, అతని అల్లుడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించారు మల్లారెడ్డి.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని.. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తనపై రాజకీయ కక్షతోనే కొందరు కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్ (X) వేదికగా మండిపడ్డారు.


Advertisment
తాజా కథనాలు