MLA KTR: రుణమాఫీతో రైతులను మోసం చేస్తోంది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్ TG: రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతుబంధు నిధి రూ.7000 కోట్లను రుణమాఫీకి దారిమళ్లింపు చేస్తోందని ఆరోపించారు. వెంటనే అర్హులైన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 18 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA KTR: రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని అన్నారు మని మంత్రి కేటీఆర్. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు. 7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లింపు చేస్తోందని ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ (Runa Mafi) చేస్తున్నమని పోజులు కొడుతున్నారని మండిపడ్డారు. 40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తరు?, 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా? అని ప్రశ్నించారు. 2014 లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ. 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందని అన్నారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని.. అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్! 👉 రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు. 7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లింపు. 👉 హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు. 👉 40 లక్షల పైచిలుకు… — KTR (@KTRBRS) July 18, 2024 Also Read: డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలి.. హైకోర్టుకు నిరుద్యోగులు #ktr #rythu-runa-mafi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి