BREAKING: దమ్ముంటే డేట్, ప్లేస్ చెప్పు.. రేవంత్‌కు హరీష్ రావు మరో సంచలన సవాల్!

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి సవాల్ విసిరారు. రుణమాఫీ పైన చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. డేట్, ప్లేస్.. రేవంత్ చెప్పాలన్నారు. రైతుల సమక్షంలో రుణమాఫీపై చర్చకు సీఎం రేవంత్ రావాలని సవాల్ విసిరారు.

New Update
MLA Harish Rao: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao: తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ పార్టీల నడుమ మాటల యుద్దానికి దారి తీస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ వరకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే.. లేదు రుణమాఫీ రైతులందరికీ జరగలేదని.. అంత తూచ్ అని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. రుణమాఫీ చేశాము.. హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు. రుణమాఫీ పైన చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. డేట్, ప్లేస్.. రేవంత్ చెప్పాలన్నారు. రైతుల సమక్షంలో రుణమాఫీపై చర్చకు సీఎం రేవంత్ రావాలని సవాల్ చేశారు. పూర్తి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే దేనికంటే దానికి సిద్ధమని అన్నారు.

గతంలో కొడంగల్ లో ఓడిపోతే రాజకీయా సన్యాసం తీసుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం కదా ?  అని ప్రశ్నించారు. చేసిన సవాల్ ప్రకారం రేవంత్ రాజకీయ సన్యాసం స్వీకరించారా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో కోసం పదవులు వదులుకున్న చరిత్ర తమదని అన్నారు. సంపూర్ణ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పానని.. రైతులకంటే తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. దమ్ముంటే వాస్తవ లెక్కలతో రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

54 శాతం రైతులకు రుణమాఫీ చేయలేదు..

రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని ఖమ్మంలో రేవంత్‌ చెప్పారని అన్నారు హరీష్ రావు. రూ.31 వేల కోట్లు ఉందని చెప్పి రూ.18 వేల కోట్లు చేశారని చెప్పారు. 54 శాతం రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ఏరకంగా రుణమాఫీ చేశామని రేవంత్‌ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. 27 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేశారని చెప్పారు. 47 లక్షల రైతులు రుణమాఫీకి అర్హులని కేబినెట్‌లో చెప్పారని అన్నారు.

Also Read : వైసీపీ బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా!

Advertisment
తాజా కథనాలు