/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/SUMAN-jpg.webp)
ఎవరెన్ని కుట్రలు పన్నినా....బీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బల్కా సుమన్. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి..మూకుమ్మడిగా తనమీద దాడిస్తున్నారన్నారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారని బల్కాసుమన్ ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలో ఏదైనా కుట్ర చేసి తనను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తనకు చెన్నూరు నియోజకవర్గ ప్రజల మీద నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని...చెన్నూరు లో తనను భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమన్నారు. ఆర్టీవీతో బల్కా సుమన్ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">