Medigadda: నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు TG: ఈరోజు మేడిగడ్డ బ్యారేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. కేటీఆర్ నేతృత్వంలో ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్‌హౌస్, ఉదయం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. కాగా, నిన్న ఎల్‌ఎండీ రిజర్వాయర్ సందర్శించారు ఎమ్మెల్యేలు. By V.J Reddy 26 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Medigadda: ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. కేటీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్‌హౌస్ పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ నేతల తొలి విజిట్ ఇదే. నిన్న ఎల్‌ఎండీ రిజర్వాయర్ సందర్శించారు ఎమ్మెల్యేలు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయింది, పనికి రాదు అని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ ఈ వ్యూహం తెరకెక్కించింది. కొంపముంచిన మేడిగడ్డ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మేడిగడ్డ ప్రాజెక్ట్ బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అధికార పీఠం నుంచి తప్పించేందుకు ఆనాడు ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలకు ఒక పదునైన ఆశ్రంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ నిలిచింది. అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఒక్క ఎకరం కూడా పారడం లేదని ఆనాడు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆరోపించాయి. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ లోని కొని పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో ప్రజలు కూడా ఈ ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగిందని.. ఆ ప్రాజెక్ట్ పనికి రాదు అని భావించారు. కాగా కుంగిపోయిన మేడిగడ్డను చూసేందుకు రాహుల్ గాంధీ రావడంతో రాష్ట్రీయ వార్తా కాస్త దేశ వార్తల్లోకి ఎక్కి కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించేలా చేసింది. చివరికి కేసీఆర్ సీఎం గద్దె నుంచి దించేసింది. #medigadda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి