Big Breaking: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కీలక నేతలు.. మైనంపల్లితో పాటు..

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

New Update
Big Breaking: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కీలక నేతలు.. మైనంపల్లితో పాటు..

బీఆర్ఎస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmanthrao), ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula veeresham), కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో వారికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వని కారణంగా మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తనకు టికెట్ కేటాయించిన తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో బీఆర్ఎస్ కూడా ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు మైనంపల్లిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన హస్తం గూటికి చేరారు. మైనంపల్లితో పాటే ఆయన కుమారుడు రోహిత్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

publive-image

మైనంపల్లికి మల్కాజ్ గిరి టికెట్ తో పాటు ఆయన కుమారుడికి మెదక్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా నకిరేకల్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ కు దూరమైన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను కూడా కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకుంది. ఆయనకు నకిరేకల్ టికెట్ పై స్పష్టమైన హమీ లభించినట్లు సమాచారం. ఇంకా రెండు నెలల క్రితం బీఆర్ఎస్ లో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాసానికి ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు కూడా భువనగిరి టికెట్ పై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ చేరికల్లో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నెలాఖరులోగా పార్టీలో చేరికలను పూర్తి చేయాలన్నది ఆ పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది. అనంతరం అభ్యర్థల పేర్లను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని హస్తం పార్టీ భావిస్తోంది.

ఇది కూడా చదవండి:

Komatireddy Venkatreddy: మైనంపల్లి చేరికకు కోమటిరెడ్డి దూరం.. ఆయనపై ఆగ్రహంతోనేనా?

Advertisment
తాజా కథనాలు