Janagama: జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీలో ఒక చీడపురుగులా టీడీపీ పార్టీ నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమకారులను కడియం శ్రీహరి అనీచివేశాడని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన తమలాంటి వాళ్ల మీద కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేశాడని ఆయన మండిపడ్డారు.
This browser does not support the video element.
ఉద్యమకారుడైన డాక్టర్ రాజయ్యని కాదని పార్టీలోకి వచ్చిన వెంటనే ఎంపీ పదవి ఇచ్చి.. తర్వాత కాలంలో ఉపముఖ్యమంత్రి పదవి, మీ కూతురుకి ఎంపీ టికెట్ ను బీఆర్ఎస్ పార్టీ కేటాయించిందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గుర్తు చేశాయి. మీ స్థాయిని ఎప్పుడు కూడా కేసీఆర్ తగ్గకుండా చూసుకున్నారన్నారు. ఈరోజు ఉద్యమకారుడైన డాక్టర్ రాజయ్యని కాదని ఎమ్మెల్యే పదవి కూడా ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటే.. ఇప్పుడు పార్టీని వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లోకి ఎందుకోసం వెళ్తున్నావో చెప్పాలని వారు ప్రశ్నించారు.
శ్రీహరికి కుట్రలు, వెన్నుపోట్లు కొత్త కాదని ఫైర్ అయ్యారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు పక్కన చేరి ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాడని ఆరోపించారు. ఈరోజు అదే వెన్నుపోటు ద్వారా కేసీఆర్‌ని అణిచివేయాలనుకుంటున్నాడని విమర్శించారు. కడియం శ్రీహరి నీకు ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాలని సవాల్ చేశారు. నీవల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంకా ఎంతమంది బలి కావాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రశ్నించారు. నీవల్ల డాక్టర్ రాజయ్య, ఆరూరి రమేష్, పసునూరి దయాకర్, మొదలగు ఉద్యమకారులను బీఆర్ఎస్ పక్కకు పెట్టిందన్నారు. పార్టీ నీకు ఏమి తక్కువ చేసిందో చెప్పాలని కాంగ్రెస్‌లోకి వెళ్తున్నావు చెప్పాలన్నారు. ఈరోజు నుంచి నిన్ను నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరగకుండా అడ్డుకుంటామన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి పార్టీలు మారే ఊసరవెల్లిని నమ్మి చేరదీయొద్దని కోరారు. ఒకవేళ చేరదీస్తే శిష్యుడైన రేవంత్‌రెడ్డిని కూడా అణగదొక్కి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తాడని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఈ రాశుల వారికి ఆ రోజు కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా?