Harish Rao: రుణమాఫీ వల్ల రైతులకు కొత్త సమస్యలు: హరీష్ రావు

TG: ప్రభుత్వం రుణమాఫీ చేయడం రైతులకు మరో సమస్యలా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని రైతులు బాధపడుతున్నారని అన్నారు. ఏడు నెలల వడ్డీని ప్రభుత్వం కట్టాలని డిమాండ్ చేశారు.

Harish Rao: రుణమాఫీ వల్ల రైతులకు కొత్త సమస్యలు: హరీష్ రావు
New Update

Harish Rao: డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను.. పరిష్కరించాలని కోరుతున్నట్లు చెప్పారు.

#harish-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe