BRS Secunderabad MP Candidate: సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే.. ఎలాగైనా ఇక్కడ గెలవాలన్న లక్ష్యంతో కేసీఆర్ (KCR) వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ (MLA Padma Rao) ను ఇక్కడి నుంచి పోటీకి దించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పద్మారావు గౌడ్ కు సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు సనత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది.
ఇది కూడా చదవండి: Loksabha Elections 2024: సిద్దిపేటలో రఘునందన్ ఎన్నికల ప్రచారం
పార్టీ బలంతో పాటు పద్మారావు గౌడ్ కు ఉన్న ఇమేజ్, గౌడ సమాజికవర్గం ఓట్లు బీఆర్ఎస్ ను ఇక్కడ విజయతీరానికి చేరుస్తుందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ కు ఛాన్స్ ఇస్తే...పద్మారావు గౌడే అతనిపై పోటీకి సరైన అభ్యర్థి అని నిర్ణయానికి వచ్చినట్లు తెలంగాణ భవన్ లో చర్చ సాగుతోంది. ఒక వేళ.. పద్మారావుగౌడ్ కాదంటే.. అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన ఎడ్ల సుధాకర్ రెడ్డిని బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Komatireddy : అసదుద్దీన్ ఓవైసీ పెద్ద దొంగ.. మంత్రి కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, కంటోన్మెంట్, సనత్‌నగర్, ఖైరతాబాద్, నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో నాంపల్లి మినహా మిగతా అన్ని సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలను రిపీట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.