Ex MLA Shakeel: అలా చేస్తే నా కొడుకుని ఉరితీయండి.. మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

TS: డీసీపీ విజయ్‌కుమార్, పోలీసులు తన కుమారుడు రాహిల్‌ను వేధిస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే షకీల్. కావాలనే తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఆక్సిడెంట్ కేసులో తన కొడుకు తప్పు చేసినట్లు నిరూపితమైతే చట్టపరంగా ఉరి తీయవచ్చని అన్నారు.

Ex MLA Shakeel: అలా చేస్తే నా కొడుకుని ఉరితీయండి.. మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు
New Update

BRS Ex MLA Shakeel Son Accident Case: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన ఆరోపణలు చేశారు. డీసీపీ విజయ్‌కుమార్, పోలీసులు తన కుమారుడు రాహిల్‌ను వేధిస్తున్నారని అన్నారు. తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ కేసులో తన కుమారుడి ప్రమేయం లేదని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.


ALSO READ:  బీజేపీ సంచలన నిర్ణయం.. ఎంపీ అభ్యర్థి మార్పు?

తన కొడుకు తప్పు చేసినట్లు నిరూపితమైతే చట్టపరంగా ఉరి తీయవచ్చు అని అన్నారు. తనపై రాజకీయ కక్ష వుంటే తన కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అని ప్రశ్నించారు. కేసు పారదర్శకంగా విచారణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తన ఆరోగ్యం బాగాలేకపోయినా తన పై ఎఫ్ఐఆర్ చేశారని వ్యాఖ్యానించారు. తన కుమారుడికి ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ, పోలీసు అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. జరుగుతున్న పరిణామాలపై రాజకీయ నాయకులు అందరూ ఆలోచించాలని కోరారు.

#brs-ex-mla-shakeel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe