TS Politics: ఆ పనులు రేవంత్ కు అలవాటే.. పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా: ఎర్రబెల్లి వార్నింగ్ మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే పోలీస్ స్టేషన్లలోనే కూర్చుంటామని హెచ్చరించారు. By Nikhil 19 Mar 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తనకు పార్టీ మారే ఆలోచనే లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) స్పష్టం చేశారు. ఈ రోజు వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారలేదన్నారు. ప్రణీత్ రావు ఎవరో కుడా తనకు తెలియదదన్నారు. ఆయన అమ్మమ్మ ఊరు తన స్వగ్రామమైన పర్వతగిరి అని అన్నారు. తన పేరు చెప్పాలని ప్రణీత్ రావు మీద ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తనకు ఫోన్ ట్యాపింగ్, వార్ రూమ్ తెలియదన్నారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారు అధికార పార్టీలోకి పోతున్నారన్నారు. ఇది కూడా చదవండి: KCR RSP : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఆ కీలక బాధ్యతలు.. కన్ఫామ్ చేసిన కేసీఆర్! కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారన్నారు దయాకర్ రావు. ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. నాడు ఎన్నికల కోసమే కాంగ్రెస్ ఈ డ్రామా చేసిందన్నారు. కేసీఆర్ (KCR) పెట్టిన పథకాలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదన్నారు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) అలవాటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ధ్వజమెత్తారు. నేను పార్టీ మారడం లేదు, విషప్రచారాలను నమ్మకండి. pic.twitter.com/eweIJAbzPl — Errabelli Dayakar Rao (@EDRBRS) March 19, 2024 మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. నాయకులు పోయినంత మాత్రాన ఏమీ కాదని.. కార్యకర్తలు దైర్యంగా ఉండాలని సూచించారు. కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడితే తాము పోలీస్ స్టేషన్ లో కూర్చుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గెలుపు, ఓటములు సహజమని.. ఎన్టీఆర్ లాంటి నాయకుడికి కూడా ఓటమి తప్పలేదన్నారు. #brs #cm-revanth-reddy #errabelli-dayakar-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి