/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/KCR-ASSEMBLY.jpg)
KCR: అసెంబ్లీకి బయలుదేరారు మాజీ సీఎం కేసీఆర్. నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి చేతికర్ర లేకుండానే బయలుదేరారు. కేసీఆర్‌కు దిష్టి తీసి అసెంబ్లీకి పంపారు కుటుంబ సభ్యులు. కేసీఆర్ ఎంట్రీతో జోష్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ప్రతిపక్షనేత హోదాలో తొలిసారికి అసెంబ్లీకి వేళనున్నారు కేసీఆర్. రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో అసెంబ్లీకి కేసీఆర్ వెళ్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు కేసీఆర్. ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చి వెళ్లారు కేసీఆర్. కేసీఆర్ రాకతో రసవత్తరంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభలో కేసీఆర్ మొదటి ప్రసంగంపై జనాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.