KCR: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా? అని ప్రశ్నించారు. కేవలం ఒక శాతం తేడాతో ఓడిపోయామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

KCR: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
New Update

KCR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎంతో మంది పోరాటం చేశారని.. వారందరు సదా స్మరణీయులు అని అన్నారు. 1969లో ఉద్యమానికి ప్రధాన కారణం ముల్కీ రూల్స్ అని పేర్కొన్నారు. ఈ ముల్కీ రూల్స్ పై ఆనాడు విద్యార్థులు, యువకులు పోరాడారు అని అన్నారు. ఆ తర్వాత ఉద్యమం సమసిపోయిందని పేర్కొన్నారు. ముల్కీ రూల్స్ పై తెలంగాణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వచ్చిందని అన్నారు. ఆ వెంటనే జై ఆంధ్ర ఉద్యమం వచ్చినట్లు చెప్పారు. అక్కడ కూడా 70 మందికిపైగా చనిపోయారని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును కూడా కాలరాసి రాజ్యాంగ సవరణ ద్వారా ముల్కీ రూల్స్ రద్దు చేశారని పేర్కొన్నారు. ఏనాటికైనా కేసీఆర్ లాంటి నాయకుడు రాబోడా అనే ఆశతోనే పోరాటం చేశామని ప్రొఫెసర్ జయశంకర్ తనతో అన్నారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ కు రోజులు దగ్గరపడ్డాయి..

మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా? అని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపాం అని అన్నారు. అప్పుడప్పుడూ కొంత విషపు గాలి వస్తుందని.. తప్పుడు ప్రచారాలు.. తప్పుడు హామీలకు ప్రజలు భ్రమపడ్డారని పేర్కొన్నారు. కేవలం ఒక శాతం తేడాతో ఓడిపోయామని అన్నారు. ఎలా ఉన్న ప్రజల కోసం పని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. గులాబీ జెండా పుట్టింది తెలంగాణ సంరక్షణ కోసమన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తామని కొందరు అంటున్నారని.. ఇవ్వన్ని టెంపరరీ సెట్ బ్యాక్స్ అని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కరెంట్ లేని తెలంగాణగా చేస్తోందని ఫైర్ అయ్యారు. రైతు బంధు ఎందుకు బంద్ చేస్తున్నారని అని నిలదీశారు.

 

#kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe