Telangana: రేపే పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్‌లు పంపిణీ.. పదిమంది అభ్యర్థులకు కేసీఆర్ షాక్ ?

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్.. 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ 5 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న ఆయన తెలంగాణ భవన్‌లో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేయనున్నారు.

New Update
KCR: బీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైపోయింది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం.. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 30న రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్.. 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ 5 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న ఆయన తెలంగాణ భవన్‌లో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేయనున్నారు. మరోవైపు పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు తమ గళం విప్పుతునే ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని పునః పరిశీలించాలని పార్టీ అధినేత ముందుకు తమ అభిప్రాయాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు.

Also read: ఖరారైన కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అభ్యర్థులు.. తుమ్మల, పొంగులేటి పోటీ ఎక్కడంటే?

గత కొన్నిరోజుల నుంచి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు అసమ్మతి సెగ తగులుతోంది. అసమ్మతి నేతలను సంతృప్తిపరిచేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు బదులు మరొకరికి టికెట్ ఇవ్వాలంటూ స్థానికంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ ఇవ్వొద్దని.. పార్టీ నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిసి డిమాండ్ చేశారు. ఇటీవల మెదక్ అసెంబ్లీ నియోజవర్గంలో కూడా ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ అసమ్మతి నేతలు ఆరోపణలు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కూడా టికెట్ ఇవ్వకూడదని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. స్టెషన్‌ఘన్‌పూర్‌లో ఇటీవల సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. ఇలా దాదాపు పది నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. అయితే రేపు కేసీఆర్ అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేయనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు.. పలు నియోజకవర్గాల్లో మార్పులు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే వీటిపై ఈరోజు సాయంత్రం కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ పలువురు నేతలకు కూడా పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎ కేసీఆర్ జిల్లాల పర్యటనలకు సంబంధిచింది బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక అక్టోబర్ 15న హుస్నాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభతో ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అక్టోబర్‌ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో.. అక్టోబర్‌ 17న సిద్దిపేట, సిరిసిల్ల.. అక్టోబర్‌ 18న జడ్చర్ల, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక నవంబర్‌ 9న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన‌ తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేయ‌నున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు