మెదక్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. తండ్రి అస్థికలు గంగలో కలిపేందుకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా రాజంతండా ఇనాం పేటకు చెందిన ఓ వృద్దుడు కొద్ది రోజుల క్రితం కాలం చేశాడు.
ఈ క్రమంలో తండ్రి అస్థికలు గంగలో కలిపేందుకు శనివారం నాడు హర్యా సింగ్, బాల్ సింగ్ మెదక్- కామారెడ్డి సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అయితే గంగలో అస్థికలు కలిపే సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు నీటి మునిగి కొట్టుకుని పోయారు.
ఈ విషయాన్ని గమనించిన బంధువులు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు స్థానికుల సాయంతో మృతదేహలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒకే ఇంట్లో రోజుల వ్యవధిలో ముగ్గురు చనిపోవడంతో విషాదం అలుముకుంది.
Also read: ఐటీ ఉద్యోగం కోసం వెతుకున్నారా? ఆ స్కిల్ ఉంటే లక్షల్లో జీతం.. ఓ లుక్కేయండి