Siddipet : తమ్ముడి భార్యకు పిల్లలు కావట్లేదనే నెపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా మరదలుపై కన్నేసిన కామాంధుడు తన కోరిక తీర్చాలంటూ భార్య సహాయంతో లైంగిక దాడి (Sexual Assault) చేశాడు. ఈ దారుణమైన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలో జరిగగా వివారాలు ఇలా ఉన్నాయి.
దుబ్బాక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో సీఐ పి. శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించి, ఘటన వివరాలు వెల్లడించారు. అక్బర్ పేట- భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఒక కామాంధుడు తన సొంత తమ్ముడి భార్యపై కన్నేశాడు. తన తమ్ముడికి పెళ్లయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా, పిల్లలు కాకపోవడంతో తన కోరిక తీర్చాలని తన భార్య సహాయంతో మరదలిని భయపెట్టి, లొంగదీసుకుని ఆమెపై అత్యాచారం (Rape) చేశాడు.
ఈ అత్యాచారం ఘటనను భార్య సహాయంతో వీడియో కూడా తీయించి, బెదిరించాడు. పదేపదే బావ, అతని భార్య వేధింపులు భరించలేక భర్త అత్త మామ దృష్టికి తీసుకు పోయిన వారు పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళ తన తల్లి, బంధువుల సహాయంతో దుబ్బాక (Dubbaka) సర్కిల్ కార్యాలయంలో సీఐకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూంపల్లి పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతని భార్యపై అత్యాచారం కింద కేసు నమోదు చేసి, వారిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచి, రిమాండ్ కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేటలోని భరోసా కేంద్రానికి తరలించారు.
Also Read : కమిటీలతో సమస్యలు పరిష్కరిస్తాం.. భట్టి విక్రమార్క!