చెల్లిని రోకలి బండతో కొట్టి చంపిన అన్న.. ఎందుకో తెలుసా?

ఫోన్ చాటింగ్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసినందుకు రోకలిబండతో చెల్లిని కొట్టి చంపాడు ఓ అన్న. ఇల్లందులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. అన్నాచెల్లల అనుబంధానికి మచ్చ తీసుకొస్తూ ..క్షణికావేశంలో దారుణానికి పాల్పడ్డాడు.

New Update
చెల్లిని రోకలి బండతో కొట్టి చంపిన అన్న.. ఎందుకో తెలుసా?

Brother who beat sister to death with pestle... Do you know why?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దారుణం చోటుచేసుకుంది. ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మెసేజ్‌ చేస్తుందని అన్న హరి చెల్లిని రోకలిబండతో కొట్టి చంపాడు. రాజీవ్‌నగర్ తండాలో ఈ ఘటన జరిగింది. మృతురాలు సింధు మహబూబ్‌నగర్ నర్సింగ్ కాలేజీలో ఏఎన్ఎం కోర్సు చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఓ అబ్బాయితో సింధుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే సింధు తరచూ చాటింగ్ చేస్తుండగా, అలా చేయొద్దని సింధుతో అన్నయ్య హరి గొడవ పడ్డాడు. నిన్న చాటింగ్ చేస్తుండగా చూసి సింధును కొట్టాడు . తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న సింధును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సింధు మృతి చెందింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత ఫిబ్రవరిలో బెంగళూరులో కూడా ఇలాంటి దారుణం ఒకటి చోటుచేసుకుంది. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల అబ్బాయిని నలుగురు యువకులు హత్య చేశారు. అంతేకాకుండా చాటింగ్, సోషల్‌మీడియా కారణంగా తరచూ గొడవలు..హత్యలకు గురి అవుతున్న సంఘటనలు మనం చూస్తునే ఉన్నాం. జూలై 22న (శుక్రవారం) ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ళ గ్రామంలో ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తున్నాడని భర్త ఆనందబాబు మర్మాంగాన్ని కోసింది మొదటి భార్య . తీవ్రగాయాలతో ఉన్న ఆనంద్ బాబును కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

Advertisment
తాజా కథనాలు