BREAKING: తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తా

 తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తాను నియమించింది ఎన్నికల కమిషన్. దీని సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 

New Update
BREAKING: తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తా

NEW DGP TO TELANGANA: తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తాను నియమించింది ఎన్నికల కమిషన్. దీని సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్ పై ఎన్నికల కమిషన్ సస్సెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఉదయం తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందన్న వార్తలు వచ్చిన కొద్ది సేపటికే డీజీపీ టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిని కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర పోలీస్ బాస్ గా ఉన్న డీజీపీ ఇలా రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు వేసినట్లు సమాచారం. అదనపు డీజీలు ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, సంజయ్ జైన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈసీ.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు