No Strike: ఏపీ ప్రజలకు రిలీఫ్.. రేపటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికుల సంఘాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మె తాత్కాలికంగా విరమిస్తామని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వానికి తెలిపారు. రేపటి నుంచి విధుల్లో చేరుతామని అన్నారు. By V.J Reddy 10 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Municipal Workers Stopped Strike In AP: మున్సిపల్ కార్మికుల సంఘాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మె తాత్కాలికంగా విరమిస్తామని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వానికి తెలిపారు. రేపటి నుంచి విధుల్లో చేరుతామని అన్నారు. ALSO READ: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఫైనల్ ఇది రెండో సారి.. ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరపడం ఇది రెండో సారి. ఇటీవల మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీతంలోనే హెల్త్ అలవెన్స్ కలిపి రూ. 21 వేలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. లేదు, తమకు నెలకు రూ.24 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. వారి డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో వారు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగించారు. తాజాగా ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. నెలకు రూ .21,000 మొదటి సారి ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తమకు నెలకు రూ.24 వేలు జీతంగా ఇవ్వాలని మున్సిపల్ కార్మిక సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. వారికి మంత్రి బొత్స సత్యనారాయణ నెలకు రూ.21 వేలు ఇస్తామని.. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీతం పెంచుతామని అన్నారు. దానికి వారు నో అన్నారు. తాజాగా జరిగిన చర్చల్లో గతంలో ప్రభుత్వం చెప్పిన విధంగానే రూ.21 వేల జీతానికి మున్సిపల్ కార్మిక సంఘాలు ఓకే అన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేసినట్లు సమాచారం. దానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక జీవో వచ్చాక సమ్మె విరమిస్తామని మున్సిపల్ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ALSO READ: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ పొడిగింపు వన్ టైం సెటిల్మెంట్ గా 50 వేలు: మంత్రి బొత్స ఇటీవల కార్మిక సంఘంతో జరిగిన చర్చలు తరువాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పలు కీలక విషయాలు తెలిపారు. రిటైర్ అయిన తరువాత వన్ టైం సెటిల్మెంట్ గా 50 వేలు ఇస్తాం అని కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చామని మంత్రి బొత్స తెలిపారు. కనీస సర్వీస్ 10 ఏళ్ళు ఉండాలని అన్నారు. పదేళ్ళు పైన సర్వీస్ ఉన్న వారికి ఏడాదికి రెండు వేలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండేళ్లలోనే జీతాలు ఎలా పెంచుతారని ఆయన కార్మిక సంఘాల నేతలను ప్రశ్నించారు. సమ్మె విరమించాలని సంఘాలను కోరారు. ప్రభుత్వం ఐదేళ్ళ కాలానికి ఉంటుంది.. ఐదేళ్ళకు ఒకసారి జీతాలు పెంచుతారని మంత్రి తెలిపారు. ప్రతి ఏటా జీతాలు పెంచుతారా.. మరోసారి అధికారంలోకి వచ్చాక జీతాలు పెంచుతామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. #cm-jagan #ap-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి