Governor Vs Kcr: సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళి సై మరోసారి సంచలన కామెంట్స్!

గవర్నర్ తమిళి సై మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాంతంత్ర్యదినోత్సవం వేడుకల్లో భాగంగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ఆమె అక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు తమిళినాడు సీఎం స్టాలిన్ పై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హాట్ టాపిక్ గా మారిన ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది..

New Update
Governor Vs Kcr:  సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళి సై మరోసారి సంచలన కామెంట్స్!

Tamilisai Comments on CM KCR: గవర్నర్ తమిళి సై మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాంతంత్ర్యదినోత్సవం వేడుకల్లో భాగంగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ఆమె అక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తో పాటు తమిళినాడు సీఎం స్టాలిన్ (M. K. Stalin) పై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం గైర్హాజరవ్వడం మంచిది కాదన్నారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు కార్యాక్రమానికి ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ వెళ్లకపోవడం బాధాకరమన్నారు తమిళి సై. అదే విధంగా తాను గవర్నర్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఇలానే వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి తనను తీవ్రంగా బాధించిందని ఆమె పేర్కొన్నారు.గవర్నర్ ఇంకా సీఎంల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఇండాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే మరోసారి గవర్నర్ తమిళి సై సీఎం కేసీఆర్ పై ఇలా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యే వీరిద్దరి మధ్య కాస్త అన్నీ సర్దుకుంటున్నాయని భావిస్తున్న తరుణంలో మళ్లీ ఆమె కేసీఆర్ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్, గవర్నర్ ఇద్దరు చాలా గ్యాప్ తరువాత ఒకే వేదికపై కనిపించారు.

అదే విధంగా రాజ్ భవన్ లో జరిగిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా దాదాపుగా ఏడాది తరువాత కేసీఆర్ రాజ్ భవన్ లో అడుగుపెట్టారు. పెండింగ్ బిల్లులపై కూడా రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ నెలకొన్న వార్ కాస్త చల్లబడుతోంది. టీఎస్ఆర్టీసీ బిల్లుకు కూడా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి కాస్త సర్దుకుంటున్న తరుణంలో గవర్నర్ మరోసారి ఈ కామెంట్స్ చేయడం పై బీఆర్ఎస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Also Read: గోల్కొండ కోటలో అట్టహాసంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు..జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్!

Advertisment
తాజా కథనాలు