BIG BREAKING: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. చలాన్లపై రాయితీని పొడిగించింది. ఈ నెల 31వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానాకు 113 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 2 కోట్లకు పైగా పెండింగ్‌ చలాన్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

New Update
BIG BREAKING: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ పొడిగింపు

Discount On Traffic Challans Extended: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. చలనాలపై రాయితీని పొడిగించింది. ఈ నెల 31వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పెండింగ్ చలానాలు 3 కోట్ల 9 లక్షలు ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ సారి ప్రవేశ పెట్టిన చలానాలు రాయితీ తరువాత కోటి 7 లక్షల మంది వాహనదారులు తమ పెండింగ్ చలానాలు (Pending Challans) క్లియర్ చేసుకున్నట్లు పేర్కొంది.

ALSO READ: డ్రైవర్లపై దాడి చేస్తే జైలుకే… సజ్జనార్ వార్నింగ్!

ఇవాళ్టితో ముగియాల్సి ఉంది..

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పెండింగ్ చలానాలపై రాయితీ గడువు నేటితో ముగియాల్సి ఉంది. ఇంకా 2 కోట్లకు పైగా పెండింగ్‌ చలాన్లు ఉండటంతో పెండింగ్‌ చలాన్లు చెల్లించేందుకు ఈ నెలఖారు వరకు గడువు పొడిగించింది రాష్ట్ర సర్కార్. పెండింగ్‌ చలాన్లపై గత డిసెంబర్‌ 26 నుంచి రాయితీ కార్యక్రమం ప్రారంభమైంది.

113 కోట్ల ఆదాయం..

పెండింగు చలానాలపై రాయితీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం ద్వారా ఇప్పటివరకు ప్రభుత్వానికి 113 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 66.57 లక్షల చలాన్లు క్లియర్‌ అయ్యాయని పేర్కొన్నారు.

ALSO READ: కాంగ్రెస్‌పై ప్రజల్లో తిరుగుబాటు.. ముందుంది అసలు సినిమా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

డిస్కౌంట్‌ల వివరాలు :

* ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీ.
* టూ వీలర్ చలాన్లపై 80 శాతం రాయితీ.
* ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం రాయితీ.
* లారీ, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం రాయితీ.

2022లో ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇలా..

2022 మార్చి 31 నాటికి తెలంగాణలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించింది రాష్ట్ర సర్కార్. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ అవకాశాన్ని 65 శాతం మంది వాహనదారులు ఉపయోగించుకున్నట్లు సమాచారం. తాజాగా గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ రెండు కోట్లకు చేరుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి రాయితీ ప్రకటించనున్నారు.

Advertisment
తాజా కథనాలు