టీచర్లకు షాకింగ్ న్యూస్..సగం మంది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్..!! తెలంగాణలోని టీచర్లకు షాకింగ్ న్యూస్. సగం మంది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. స్కూల్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20వేల మంది ఉపాధ్యాయుల బదిలీ జరగాలి.కానీ సగం పూర్తయి..మరో సగం నిలిచిపోయాయి. By Bhoomi 03 Oct 2023 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలోని టీచర్లకు షాకింగ్ న్యూస్. సగం మంది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. స్కూల్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20వేల మంది ఉపాధ్యాయుల బదిలీ జరగాలి.కానీ సగం పూర్తయి..మరో సగం నిలిచిపోయాయి. స్కూల్ అసిస్టెంట్, తెలుగు, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులతోపాటు ఫిజికల్ డైరెక్టర్ (PD)ల బదిలీలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20వేల మంది ఉప్యాధాయుల బదిలీ జరగాల్సి ఉంది. కానీ సగం వరకు మాత్రమే నిలిచిపోయాయి. భాషా పండితులు, పీడీ పోస్టులు, ఉన్నతీకరణ, పదోన్నతులను ఎస్టీటీలు వీరిందర్నీ కలుపుకుని ఉమ్మడి సీనియార్టీ ఆధారంగా చేపట్టాలని ఈ మధ్యే హైకోర్టు తుది తీర్పును కూడా వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బదిలీలు జరిగితే మారుమూల గ్రామాల్లో ఉపాధ్యాయులు ఉండరని కొందరు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఇంజనీరింగ్ చేశారా..? నెలకు లక్ష జీతంతో ఉద్యోగం మీదే..పూర్తి వివరాలివే..!! దీంతో అధికారులు వాటిని నిలిపివేయాలని, మిగిలిన ఎస్ఏలకు సోమవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని డీఈవోలను విద్యాశాఖ అదేశించింది. పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటే తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రిలీవ్ చేయకూడదని..ఇద్దరు ఉన్న చోట సీనియర్ ను బదిలీపై పంపి జూనియర్ ను అక్కడే కొనసాగించాలని సూచించారు. తమకు బదిలీ అయితే దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులు ఈ ప్రక్రియను నిలిపివేసేలా ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. వేయికి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్..!! అటు తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadeesh Reddy) అదిరిపోయే శుభవార్త చెప్పారు. 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ (Telangana Job Notification) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ లో నూతనంగా జూనియర్ లైన్ మెన్ గా నూతనంగా నియమితులైన 1362 మందికి మంత్రి నియామక పత్రాలను అందజేశారు. శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ లోని జెన్కో ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో విద్యుత్ రంగంలో 35,774 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. అందులో ఔట్ సోర్సింగ్ ద్వారా టీఎస్ఎస్పీడీసీఎల్ నియమించిన 10,312, ట్రాన్స్ కోలో 4,403, జెన్కో లో 3,689, ఎన్పీడీసీఎల్ లో 4,370 మొత్తం కలిపి 22,774 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని వివరించారు. #transfer #telangana-teachers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి