నా ఆరోగ్యం కోసం సినిమాలకు విరామం: సమంత సినీనటి సమంత తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. విడాకుల తర్వాత బిజీ షెడ్యూల్లో ఉన్న సమంత మళ్ళీ సినిమాలకు బ్రేక్ చెప్పింది. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు ప్రకటించింది. తన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి అదనపు చికిత్స కోసం ఈ టైమ్ తీసుకుంటున్నట్లు సమంత పేర్కొంది. అయితే ప్రస్తుతం ఖుషి సినిమాలో చేస్తున్న సామ్ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ మరో మూడు రోజుల్లో పూర్తి అయితన తర్వాత విరామం తీసుకుంటారట. By Vijaya Nimma 05 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి నా ఆరోగ్యానికి ప్రాధాన్యత సినీ హీరోయిన్ సమంత కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని సామ్ నిర్ణయిచుకున్నారు. ఇప్పుడు చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత సమంత సినిమాలకి బ్రేక్ తీసుకోనున్నారట చెప్పారు. అయితే బ్రేక్ మాత్రం తన ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోసమే సినిమాలకు సుదీర్ఘ విరామం ఇస్తున్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన సామ్ అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారని చెప్పక తప్పదు. ఖుషి ముగింపు దశకు అయితే సామ్ గత కొన్ని రోజులుగా మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చింది. మరో 3 రోజులో ఖుషి చివరి షెడ్యూల్ కూడా పూర్తవుతుంది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. మరోవైపు సమంత చేతిలో ఉన్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. మయోసైటిస్ అదనపు చికిత్స కోసం టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలకు సంతకం కూడా చేయదు. గతంలో తీసుకున్న నిర్మాతలకు అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారు. దాదాపుగా ఓ సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని సమంత నిర్ణయం తీసుకున్నారు. ఈ టైమ్‌న్ని తన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి మరియు అదనపు చికిత్స కోసం వెచ్చించనున్నారు. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే సమంత తిరిగి సినిమాలపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. ఖుషి సినిమా ప్రమోషన్స్‌లో కూడా సామ్ పాల్గొంటారో లేదో మరి చూడాలి. బాక్సాఫీస్ దగ్గర శాకుంతలం బోల్తా అయితే ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమా సామ్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన భారీ బడ్జెట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో తన తర్వాతి ప్రాజెక్టులపై సామ్ ఆచితూచి అడుగులు వేస్తుందనుకున్నారు అంతా. ఈ లోపే కాస్త బ్రేక్ తీసుకుని అభిమానులందరికి పెద్ద షాక్ ఇచ్చారు లేడీ సూపర్ స్టార్ సమంత. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి