కలుషిత నీటిలో స్నానం చేస్తున్నప్పుడు అమీబా ఇన్ఫెక్షన్ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుపై దాడి చేస్తుందని, అది కరోనా వైరస్ లాగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని వైద్యులు చెబుతున్నారు.ఈ వ్యాధి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాలు వైద్య శాఖ అమీబా ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కోసం మార్గదర్శకాలను జారీ చేసింది.
కలుషితమైన నీటిలో స్నానాలు చేయకూడదని, స్థానిక సంస్థలు చెరువులు, సరస్సులతో సహా నీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు సూచించింది.అలాగే స్విమ్మింగ్ ఫూల్స్ లో క్లోరినేషన్ చేసి మెయింటెయిన్ చేయాలని వైద్యశాఖ తెలిపింది.