Brahmamudi serial: బ్రహ్మముడి సీరియల్ లో ట్విస్ట్.. కల్యాణ్ తో ఆమె పెళ్లి.!

ఎట్టకేలకు బ్రహ్మముడి సీరియల్ లో అనామిక మెడలో తాళి కట్టి ఫ్యాన్స్ ను హర్ట్ చేశాడు కల్యాణ్. ఎందుకంటే, హీరోయిన్ చెల్లి అప్పు ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సీరియల్ అభిమానులు ఫీల్ అయ్యారు. కానీ, డైరెక్టర్ అందరిని నిరాశ పరిచాడు.

Brahmamudi serial: బ్రహ్మముడి సీరియల్ లో ట్విస్ట్.. కల్యాణ్ తో ఆమె పెళ్లి.!
New Update

Brahmamudi serial: బ్రహ్మముడి సీరియల్ లో అనామిక మెడలో హీరో తమ్ముడు కల్యాణ్ తాళి కట్టడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కల్యాణ్ కు హీరోయిన్ చెల్లి అప్పుతో పెళ్లి జరిగింటే బాగుండు కదా అని ఫీల్ అవుతున్నారు సీరియల్ అభిమానులు. ఎందుకంటే కల్యాణ్  కు అప్పు అయితే బాగుంటుందని ..అనామిక స్వార్థంగా ఉంటూ డబ్బు కోసమే ప్రేమిస్తున్నట్టుగా కనిపిస్తుందని భావిస్తున్నారు. కల్యాణ్ ను ప్రేమించిన అప్పు అతడిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు, అనామిక తల్లిదండ్రులేమో కల్యాణ్ నుంచి డబ్బు ఎలా ఇప్పించుకోని అప్పులు ఎలా కట్టాలా అని గుసగుసలాడుకుంటూ ఉంటారు.

publive-image

Also Read: కోడిగుడ్ల షాపు దగ్గర దారుణం.. ‘అరేయ్’ అన్నాడని యువకున్ని కొట్టి చంపిన ఫ్రెండ్స్

ఇక స్వప్న అయితే తన మీద నింద వేసిన భర్త రాహుల్ ను చెంపదెబ్బ కొట్టి గట్టిగా బుద్ధి చెబుతుంది. కట్టుకున్న భార్యను కడుపులోని బిడ్డను అనుమానిస్తావా? అంటూ దుమ్ముదులిపింది. స్వప్నకు ఎవరితో ఏ సంబంధమూ లేదని పద్దు అందరి ముందు నిజం బయటపెట్టడంతో అందరూ రాహుల్ కు తన అమ్మకు హితబోద చేస్తారు.

publive-image

ఇదిలా ఉండగా హీరోయిన్ కావ్య తల్లిదండ్రులు అప్పును చూసి జాలిపడుతుంటారు. పెళ్లి జరిగిపోవడంతో బ్రహ్మముడి సీరియల్ తో కలిసి ఉన్న నువ్వు నేను ప్రేమ సీరియల్ టీం అంతా రిటర్న్ వెళ్లిపోతుంటారు. పద్దు ఏమో హీరో రాజుకు కావ్య గురించి మంచిగా చెబుతూ తనని బాగా చూసుకోమని చెబుతుంది. మరోవైపు కావ్య ఏమో నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరో వద్దకు వెళ్లి పద్దు గురించి మంచిగా చెబుతూ తను ఎంత ప్రేమిస్తుందో చెబుతుంది.

#brahmamudi-serial
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe