Brahmamudi: ఇంటి నుంచి బయటకు వెళ్లిన కావ్య ఆలస్యంగా రావడంతో.. భార్య సీరియస్ అవుతాడు రాజ్. ఎక్కడికి వెళ్ళావ్, బుద్దుందా.. ఎప్పుడెళ్లావ్ ఎప్పుడొస్తున్నావ్ అని గట్టి గట్టిగా అరుస్తాడు. మళ్ళీ ఏ దరిద్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళావు . అసలు నా గురించిన కాస్తైన పట్టించుకుంటున్నావా అని కావ్య పై ఫైర్ అవుతాడు.
దీంతో కావ్య ఇప్పుడు మీ పరిస్థితికి ఏమైంది అని అడుగుతుంది. నీకు తెలియదా..? టీ, టిఫిన్స్, లంచ్ అంటూ మీద పడిపోతుంది ఆ మాయ. ఆ దొంగ మాయ బిడ్డకు తల్లి అని చెప్పలేము.. దాని ఓవర్ యాక్షన్ భరించలేము అని కావ్యతో చెప్తూ టెన్షన్ పడతాడు రాజ్.
మరో వైపు అపర్ణ లాయర్ కు ఫోన్ చేసి విడాకుల పత్రాలు రెడీ చేసుకొని ఉదయాన్నే ఇంటికి రమ్మని చెప్తుంది.
ఉదయాన్నే లాయర్ విడాకుల పేపర్స్ తో ఇంటికి వస్తాడు. లాయర్ ఇంటికి రాగానే అందరు ఏమైందని అడుగుతారు. దీంతో అపర్ణ అసలు నిజం బయటపెడుతుంది.
మాయకు పుట్టిన బిడ్డ ఇంటి వారసుడు కావాలంటే.. రాజ్ మాయను పెళ్లి చేసుకోవాలి. అలా జరగాలంటే ముందుగా కావ్యతో విడాకులు తీసుకోవాలి అని అందరికీ షాకిస్తుంది అపర్ణ. ఇంతకు మించి పరిష్కారం లేదని చెప్తుంది.
ఇంటి పెద్దలు సీతారామయ్య, ఇందిరాదేవి అపర్ణ నిర్ణయాన్ని ఖండిస్తారు. ఎవరిని అడిగి విడాకుల నిర్ణయం తీసుకున్నావు. కావ్యను రాజ్ నుంచి విడదీస్తే.. మాయకు న్యాయం జరుగుతుంది. మరి కావ్యకు పరిస్థితి ఏంటని కోడలు అపర్ణను నిలదీస్తారు. వాళ్ళు విడిపోవాలని చెప్పడానికి నీకేం హక్కు, అధికారం ఉంది. అసలు విడాకులు విషయం వాళ్ళను ఒకసారైనా సంప్రదించావా..? వాళ్ల అభిప్రాయాలు కనుక్కున్నావా..? అని ఫైర్ అవుతాడు సీతారామయ్య.
ఆ తర్వాత ఇందిరాదేవి విడాకుల గురించి కావ్య అభిప్రాయాన్ని అడుగుతుంది. దీంతో కావ్య.. కనీసం మీరు ఇద్దరైనా నేను ఈ ఇంట్లో నేను మనిషిని అని, నాది ఒక జీవితం అని గుర్తించారు అని ఎమోషనల్ అవుతుంది.
భర్తతో విడాకులు తీసుకోవడం ఇష్టంలేని కావ్య అత్త అపర్ణను ప్రశ్నలతో ఉక్కిబిక్కిరి చేస్తుంది. మీ కొడుకు మాయను నిజంగానే ఇష్టపడితే అంత రహస్యంగా కాపురం చేయాల్సిన అవసరం ఏంటీ..? మీ కొడుకు చేసిన నేరానికి కోడలికి శిక్ష వేస్తారా..? నీ పెళ్ళాంతో సుఖం లేదు.. అందుకే మాయను పెళ్లి చేసుకో అని మా ఆయనతో ఒక్క మాటైనా చెప్పారా..? ఆయన నిర్ణయం తీసుకున్నారా ..? అని అపర్ణ దుమ్ముదులిపేస్తుంది కావ్య. దీంతో అపర్ణ మౌనంగా ఉందిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.