Brahmamudi: బిడ్డ తల్లి వెతకడానికి వెళ్లిన కావ్యను రౌడీలు కిడ్నాప్ చేస్తారు. బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకొని వెళ్తారు. కావ్య ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చిన అప్పు చివరి నిమిషంలో అక్కను కిడ్నాప్ చేయడం చూసి రక్షించడానికి కారు వెనకాల పరుగెడుతుంది. కానీ అప్పటికే వాళ్ళు వెళ్ళిపోతారు.
కావ్యను తీసుకెళ్లిన ఆమెను బంధిస్తారు. కావ్యతో మరికొంతమంది అమ్మాయిలను కూడా వాళ్ళు కిడ్నాప్ చేసి అక్కడే బందింస్తారు. డబ్బు కోసం అమ్మాయిలను దుబాయ్ కి అమ్మేయాలని ప్లాన్ చేస్తారు.
ఇక అక్క కావ్య కిడ్నాప్ అయిన విషయాన్ని వెంటనే బావ రాజ్ తో చెప్పాలని అతనికి ఫోన్ చేస్తుంది అప్పు. కానీ రాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి చెప్పాలని అనుకుంటుంది.
మరో వైపు అనామిక భర్త కళ్యాణ్ తనను ప్రేమగా చూసుకోవడం లేదని ఇంట్లో పంచాయితీ పెడుతుంది. ఇక అనామిక ప్రవర్తనకు విసిగిపోయిన కళ్యాణ్ ఆమెకు విడాకులు ఇస్తానని తెగేసి చెప్తాడు. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు.
ఇంతలో రాజ్ కోసం అప్పు కళ్యాణ్ ఇంటికి వస్తుంది. ఇక అదే సమయంలో అప్పు రావడంతో ధాన్యలక్ష్మి, అనామిక రెచ్చిపోతారు. నీ వల్లే కళ్యాణ్ విడాకుల వరకు వచ్చాడు అని అప్పు సీరియస్ అవుతారు. దీంతో ఒళ్ళు మండిపోయిన అప్పు.. ఇలా మాట్లాడితే నిజంగానే నీ కొడుకును నా సొంతం చేసుకుంటాను జాగ్రత్త అని ధాన్యలక్ష్మిని కడిగిపారేస్తుంది. తనకు కళ్యాణ్, అనామిక విడిపోవాలనే ఉద్దేశం లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
ఇక కళ్యాణ్ విడాకులు ఇస్తానని చెప్పడంతో సీతారామయ్య, అపర్ణ, సుభాష్ అందరూ అతన్ని తిడతారు. ఏదైనా ఉంటే సర్దుకోవాలి కానీ విడాకులు ఇస్తానని చెప్పడం కరెక్ట్ కాదు అని కళ్యాణ్ కు బుద్ది చెప్తారు.
అప్పు వెళ్తుండగా రాజ్ ఎదురవుతాడు. ఇక బావ రాజ్ కనిపించడంతో కావ్య కిడ్నాప్ అయిన విషయం గురించి చెప్తుంది. దీంతో రాజ్ కంగారు పడతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.