Mega Family vs Allu Arjun: ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన సంఘటనలకు కౌంటర్లు మొదలయ్యాయి. ఏపీ ఎన్నికల ప్రచారంలో అత్యంత సంచలనం సృష్టించిన సంఘటన అల్లు అర్జున్ నంద్యాల పర్యటన. సరిగ్గా ప్రచార పర్వం ముగియడానికి కొద్ది గంటల సమయం ఉందనగా అల్లు అర్జున్ సతీ సమేతంగా నంద్యాల వెళ్లారు. అక్కడ వైసీపీ తరఫున పోటీలో ఉన్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ఆయనకు మద్దతు ఇస్తూ మాట్లాడారు. అంతే.. ఇంకేముంది.. జనసేనలో కలకలం రేగింది. మెగా కాంపౌండ్ నుంచి టాప్ పొజిషన్ లో ఉన్న హీరో.. వైసీపీకి మద్దతుగా మాట్లాడటం ఏమిటంటూ అందరూ అల్లు అర్జున్ పై కారాలు మిరియాలు నూరారు. అయితే, వాటన్నిటినీ అల్లు అర్జున్ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. సోషల్ మీడియాలో జనసేన సపోర్టర్లు.. పవన్ అభిమానులు అల్లు అర్జున్ ను ట్రోల్ చేశారు. అయితే, జనసేన ముఖ్యనేతలు ఎవరూ అప్పుడు ఈ విషయంపై ఏమీ నోరుమెదపలేదు. దీంతో దానిని మర్చిపోయినట్టు కనిపించింది.
పూర్తిగా చదవండి..Mega Family vs Allu Arjun: మెగాఫ్యామిలీలో అల్లు అర్జున్ రచ్చ.. నాగబాబు ట్వీట్ సంచలనం..
జనసేన నాయకుడు.. మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అల్లు అర్జున్ ను ఉద్దేశించినట్టుగా ఉన్న మనోడైనా పరాయోడే అంటూ నాగబాబు చేసిన పోస్ట్ కలకలం రేపింది. ఎప్పటి నుంచో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడనే వార్తలను ఈ ట్వీట్ ధృవపరిచినట్టయింది.
Translate this News: