/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2-jpg.webp)
Brahmamudi Serial Today Episode: కావ్య (Kavya) తన బావతో కలిసి పుట్టింటికి వెళ్తున్నానని చెప్పగానే షాక్ అవుతాడు రాజ్. వాళ్లిద్దరూ కలిసి వెళ్లడం ఇష్టంలేని రాజ్.. ఎలాగైనా సరే వాళ్ళతో పాటు తాను కూడా వెళ్లాలని ఫిక్స్ అవుతాడు.
రాజ్ లో జెలసీ మొదలవడం గమనించిన కావ్య, ఇందిరాదేవి, బావ.. ప్లాన్ ఫలించిందని హ్యాపీగా ఫీల్ అవుతారు.
కావ్యతో పాటు.. వాళ్ళ పుట్టింటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఇంతలో అక్కడికి వచ్చిన ఇందిరాదేవి ఏమైందని అడుగుతుంది. దీంతో రాజ్.. కావ్య తన బావతో కలిసి పుట్టింటికి వెళ్తుందంట.. అని భార్య పై ఆరోపణలు చేస్తాడు.
ప్లాన్ మొత్తం ముందే తెలిసిన ఇందిరాదేవి.. అసలు నాటకం మొదలు పెడుతుంది. ఎంత దైర్యం ఉంటే మీ అమ్మ నా మనవడ్ని మీ ఇంటికి రమ్మని పిలవదు.. అల్లుడు అంటే మర్యాద లేదా అంటూ కావ్య పై సీరియస్ అవుతుంది. కావ్య అమ్మ కనకానికి ఫోన్ చేసి.. రాజ్ ను రమ్మని చెప్పేలా చేస్తుంది. వీళ్ళ ప్లాన్ తెలియని రాజ్ ఇందిరాదేవి నిజంగానే తనకు సపోర్ట్ చేస్తుందని ఫీల్ అవుతాడు.
రాజ్, కావ్య, తన బావ పుట్టింటింకి బయలుదేరుతారు. భర్తను ఏడిపించాలని కావాలనే కారులో తన బావ పక్కన వెళ్లి కూర్చుంటుంది కావ్య. ఇది చూసి కోపంతో రగిలిపోతున్న రాజ్.. జెలసీగా ఫీల్ అవుతాడు.
కావ్యను తీసుకొని పుట్టింటికి వెళ్తాడు రాజ్. ముందు ప్లాన్ గురించి తెలిసిన కనకం.. అల్లుడిని పక్కన పెట్టేసి.. మేనల్లుడికే మర్యాదలు చేస్తుంది. కావ్యకు, రాజ్ తో హారతి ఇవ్వకుండా.. తన బావతో హారతి ఇస్తుంది కనకం. దీంతో రాజ్ తనకు హారతి ఇవ్వడం ఏంటీ అని.. కనకం పై సీరియస్ అవుతాడు. ఎలాగైనా కావ్య పై రాజ్ ప్రేమను బయటకు తెప్పించాలని నిర్ణయించుకున్న కావ్య ఫ్యామిలీ కావాలనే రాజ్ ను అవమానిస్తారు. తన పై ప్రేమ లేనట్లో నటిస్తారు.
Also RPrabhas Spirit Movie: పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్.. స్పిరిట్ స్టోరీ లైన్ పై సందీప్ వంగా క్లారిటీ