Brahmamudi Serial: రాజ్ బాబు విషయంలో ఇబ్బంది పడడం గమనించిన కావ్య.. భర్తకు సహాయం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో బాబు కోసం తనే పాలు కలుపుకొని తీసుకువెళ్తుంది. కావ్య బాబు కోసం పాలు తీసుకువెళ్లడం చూసిన అపర్ణ కోడల్ని నిలదీస్తుంది. ఎందుకు తప్పు చేస్తున్నావు అని అడుగుతుంది.
అత్త అపర్ణ నిలదీయడంతో కావ్య గట్టిగా బదులిస్తుంది. తప్పు చేసింది మీ కొడుకు.. ఏదైనా శిక్ష వేస్తే ఆయనకు వేయాలి అంతే కానీ ఆ పసివాడిని బాధపెట్టే హాక్కు మనకు లేదు. తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి. అదే సరిదిద్దుకోలేని తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి.. కానీ డబ్బుతో నిజాన్ని పాతిపెట్టకూడదు చెప్తుంది. ఎవరు ఎన్ని చెప్పిన నేను ఆ పసివాన్ని బాధపెట్టలేను వెళ్ళిపోతుంది కావ్య.
భర్త తనకు అన్యాయం చేశాడని తెలిసిన తర్వాత కూడా ఆ బిడ్డ గురించి కావ్య ఇంతగా ఆలోచించడం చూసిన ఇందిరాదేవి ఆమె గొప్పతనాన్ని మెచ్చుకుంటుంది. గొప్పగా ఆలోచించాలి అంటే గొప్ప కుటుంబంలోనే పుట్టాల్సిన అవసరం లేదు అని అపర్ణ, రుద్రాణి, ధాన్యలక్ష్మి, అనామికకు గడ్డి పెడుతుంది.
బాబు కోసం పాలు తీసుకొని వెళ్తుంది కావ్య. రాజ్ బాబుకు పాలు పట్టిస్తాడు. ఆ తర్వాత భార్యకు థ్యాంక్స్ చెప్తాడు రాజ్. దీంతో బాధ్యత పంచుకున్నాను కదా అని పెంచుకోలేను అని బదులిస్తుంది కావ్య. మరో సారి కావ్య తన బాధను రాజ్ తో చెప్తూ ఏడుస్తుంది.
భార్య బాధను చూసిన రాజ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. తనకు కష్టం, నష్టం రాకుండా చేయాలని విడాకుల పేపర్స్ పై సంతకం చేసి ఇస్తాడు. తనను విడిపోయి స్వేచ్ఛగా బ్రతకమని కావ్యకు చెప్తాడు. దీంతో కావ్య షాకవుతుంది.
రాజ్ మాటలకు తట్టుకోలేకపోయిన కావ్య అతని పై సీరియస్ అవుతుంది. ఇంత సింపుల్ గా తెగదెంపులు చేసుకొని వెళ్ళలేను. తాళి కట్టిన భార్య ఉండగా ఆ బిడ్డకు తల్లి ఎలా వచ్చిందో తెలియాలి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికిన రోజు నేను ఉండాలో లేదో నిర్ణయించుకుంటాను అని రాజ్ చేతిలో విడాకుల పేపర్స్ పెట్టి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.