/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-21T134255.466-jpg.webp)
Brahmamudi Serial: పెళ్లి రోజు వేడుకల్లో కావ్య ఒంటి నిండా నగలు వేసుకొని దుగ్గిరాల కోడలిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది. తన కూతురిని గొప్పగా చూసిన కనకం సంతోషంతో మురిసిపోతుంది. ఆ తర్వాత కనకం, కావ్య, ఇందిరాదేవి విడాకుల విషయంలో రాజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని టెన్షన్ పడుతూ ఉంటారు.
ఇంతలో రాజ్ ఒక బాబుతో ఎంట్రీ ఇస్తాడు. రాజ్ బాబును తీసుకురావడంతో దుగ్గిరాల కుటుంబం అంతా షాక్ అవుతుంది. అందరు ఆ బాబు ఎవరని రాజ్ ను నిలదీస్తారు. రాజ్ మాత్రం కొంత సమయం వరకు మౌనంగా ఉండిపోతాడు.ఇక ఇంట్లో అందరు గట్టిగా నిలదీయడంతో అసలు నిజం చెప్పేస్తాడు రాజ్. ఆ బాబు తన కొడుకని.. ఇక నుంచి వాడు దుగ్గిరాల వారసుడిగా పెరుగుతాడని చెప్తాడు. దీంతో మా రాజ్ ఇలాంటి పని చేశాడంటే మేము నమ్మం అని ఇంట్లో వాళ్ళు వాదిస్తారు. కానీ రాజ్ మాత్రం అదే నిజమని చెప్పడంతో అందరు అయోమయంలో ఉండిపోతారు.
మరో వైపు ఛాన్స్ దొరికిందని భావించిన రుద్రాణి రాజ్ పై ఆరోపణలు మొదలుపెడుతుంది. స్వప్న విషయంలో రాహుల్ చేసింది తప్పని అందరు నిందించారు. మరి ఇప్పుడు రాజ్ చేసింది ఏంటీ అని అపర్ణను నిలదీస్తుంది. ఇదేనా నీ పెంపకం అని అందరి ముందు అపర్ణను అవమానిస్తుంది రుద్రాణి.
రుద్రాణి మాటలకు తట్టుకోలేకపోయిన అపర్ణ కొడుకు రాజ్ పై కోప్పడుతుంది. ఇలాంటి తప్పు చేసే ముందు నీ భార్య, అమ్మ గుర్తుకురాలేదా అని నిలదీస్తుంది. అందరి ముందు మా పరువు తీశావు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అపర్ణ.
ఇంట్లో అందరు నిలదీయడంతో మౌనంగా ఉండిపోతాడు రాజ్. మీకు చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు.. కానీ నాకు కొడుకు ఉన్నాడనేది మాత్రం నిజం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ ఇలా చెప్పడంతో కుప్పకూలిపోతుంది కావ్య.
రాజ్ మోసాన్ని తట్టుకోలేకపోతున్న కావ్య గదిలోకి వెళ్లి రాజ్ పై ఫైర్ అవుతుంది. తాను ఇప్పుడు ఏం చేయాలో చెప్పమని రాజ్ ను నిలదీస్తుంది. సర్దుకుపోవాలా.. లేదా విడాకులు ఇచ్చి శాశ్వతంగా దూరమైపోవాలా..? అని రాజ్ ను అడుగుతుంది. మీరు ఎక్కడో కాపురం వెలగబెట్టి డైరెక్ట్ గా బిడ్డతో వచ్చినందుకు నిజాయితీపరుడని ఆనందపడాలా అని రాజ్ ను నిలదీస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.