Brahmamudi Serial: విడాకుల విషయంలో రాజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని భయపడుతూ ఉంటుంది కావ్య. ఆయనలో మార్పు కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్నాను. ఈ ఏడాదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు, కన్నీళ్లతో గడిపిన రోజులు ఉన్నాయి అని ఇందిరాదేవితో కనీళ్ళు పెట్టుకుంటుంది. కావ్య భాదను అర్ధం చేసుకున్న ఇందిరాదేవి ఆమెకు దైర్యం చెప్తుంది. ఈరోజు రాజ్ ఖచ్చితంగా నీ పై ప్రేమను బయటపెడతాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు అని కావ్యకు సర్దిచెప్తుంది.
మరో వైపు పెళ్లి రోజు వేడుకల్లో ధాన్యలక్ష్మి, అనామిక, రాహుల్, రుద్రానికి ఒకే చోట కూర్చొని ఉంటారు. వీళ్ళను చూసిన ప్రకాశం దుష్టచతుష్టయం అంతా ఒకే చోట ఉన్నారేంటీ అని వారి పై సెటైర్స్ వేస్తాడు. ఇది అర్ధం కానీ రుద్రాణి, రాహుల్ అయోమయంగా ఉంటారు.
రాజ్, కావ్యల పెళ్లి రోజు వేడుకల కోసం కనకం, అప్పు, కృష్ణమూర్తి కూడా వస్తారు. అప్పు ఫంక్షన్ కు రావడం జీర్ణించుకోలేకపోయిన అనామిక, ధాన్యలక్ష్మి వాళ్ళను సూటి పోటి మాటలతో అవమానిస్తారు. దీంతో అప్పు.. ఇది మా అక్క ఇల్లు నాకు ఇష్టమైనప్పుడు వస్తాను అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది.
పెళ్లి వేడుక కోసమని తెప్పించిన కేక్ ను పొరపాటున కింద పడేస్తాడు. దీంతో కాస్త చూసుకోవాలి కదా అని కళ్యాణ్ ను మందలిస్తుంది అపర్ణ. ఇది చూసిన ధాన్యలక్ష్మి తోడికోడలితో వాదనకు దిగుతుంది. ఆ పనికిమాలిన కేక్ కోసం తన కొడుకును మందలిస్తావా అని అపర్ణతో పోట్లాడుతుంది. అత్త ధాన్యలక్ష్మికి తోడుగా అనామిక కూడా రెచ్చిపోతుంది.
అపర్ణతో అనామిక, ధాన్యలక్ష్మి ప్రవర్తించిన తీరును గమనించిన ఇందిరాదేవి అత్తాకోడళ్ళకు క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత ఇటు అపర్ణ కూడా మందలించడంతో తోకముడుచుకొని వెళ్ళిపోతారు.
రాజ్ గురించే ఆలోచిస్తున్న కావ్య.. పెళ్లి వేడుకల్లో రాజ్ తనను భార్యగా అంగీకరించినట్లు.. జీవితాంతం తనకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేసినట్లు కల కంటుంది. అది నిజమేనని ఆనందంగా ఫీల్ అవుతుంది. కానీ అది కేవలం కలే అని తెలుసుకున్న కావ్య నిరాశ చెందుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఇందిరాదేవి..ఆ కలే నిజమవుతుంది అని కావ్యకు దైర్యం చెప్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.