Brahmamudi Serial Today Episode: రాజ్, కావ్య పెళ్లి రోజు సందర్భంగా దాంపత్య వ్రతం చేయించాలని చెప్తుంది ఇందిరాదేవి. దీంతో ధాన్యలక్ష్మి కలుగజేసుకొని రాజ్, కావ్యలతో వ్రతం చేయించడం అపర్ణకు ఇష్టం లేదని వెటకారంగా మాట్లాడుతుంది. ఒకవేళ ఇష్టమే ఉంటే పెళ్లి రోజు నగలను కోడలికి ఎప్పుడో ఇచ్చేది. కేవలం నా పై కోపంతోనే కావ్యకు కోడలి హోదా ఇచ్చింది, ఇష్టంతో కాదు అని అపర్ణను రెచ్చగొడుతుంది.
ధాన్యలక్ష్మి మాటలకు రెచ్చిపోయిన అపర్ణ ఇంట్లోకి వెళ్లి నగలు తీసుకొస్తుంది. అందరి ముందు ఆ నగలను కోడలి చేతికి ఇస్తుంది. దీంతో ధాన్యలక్ష్మి నోరు మూసుకుంటుంది.
ఇంట్లో అందరి ముందు కోడలికి నగలు ఇచ్చిన అపర్ణ లోపలి వచ్చాక కావ్యకు షాకిస్తుంది. నగలు ఇస్తే కోడలిగా అంగీకరించినట్లు కాదు, ఇది కేవలం నా బాధ్యత మాత్రమే అందుకే ఇచ్చాను అని కావ్యను బాధపెడుతుంది.
మరో వైపు ఇంట్లో అందరు పూజ కోసం రెడీ అయ్యి కిందకు వస్తారు. అందరు వచ్చినా .. రాజ్ ఇంకా రాకపోవడంతో.. తనకు పూజ చేయడం ఇష్టంలేదేమో అని పుల్ల విరుపుగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి.
ఇంతలో అపర్ణ వెళ్లి రాజ్ ను తీసుకొస్తుంది. పూజలో కూర్చున్న రాజ్ ఆఫీస్ లో పని ఉంది త్వరగా వెళ్లాలని అంటాడు. దీంతో ఇందిరాదేవి ఈరోజు నీ పెళ్లి రోజు కదా ఈ పనులు ఎందుకు పెట్టుకున్నావు అని రాజ్ ను తిడుతుంది. ఆ తర్వాత రాజ్, కావ్య పూజ మొదలు పెడతారు.
పూజలో భాగంగా భార్య భర్తలు ఇద్దరు జీవితాంతం తోడునీడగా కలిసే ఉంటామని ప్రమాణం చేయాలనీ చెప్తాడు పంతులు. ప్రమాణం చేయడానికి అపర్ణనను హారతి పళ్లెం పట్టుకోమని చెప్తుంది. కావ్య ప్రమాణం చేస్తుంది.. రాజ్ ప్రమాణం చేయబోతుండగా హారతి పళ్లెం కింద పడేస్తుంది అపర్ణ.
హారతి పళ్లెం కింద పడడంతో కీడుగా భావిస్తుంది కావ్య. రాజ్ విడాకులు ఇస్తాడేమో అని ఇందిరాదేవితో టెన్షన్ పడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో రాజ్ అందరి ముందు కావ్యకు విడాకుల పేపర్స్ ఇస్తాడు
Also Read: Singer Mangli: ఆ రోజు జరిగింది అదే.. యాక్సిడెంట్ పై రియాక్టైన సింగర్ మంగ్లీ