Brahmamudi Serial: రాజ్ భార్యను అంగీకరిస్తాడా..? అయోమయంలో పడిన కావ్య జీవితం.. టెన్షన్ లో ఇందిరాదేవి..!

అనామిక ఫ్రెండ్స్ ముందు లేని గొప్పలు చెప్పుకుంటుంది. దీంతో కళ్యాణ్ అసలు నిజం బయటపెట్టి ఆమె పరువు తీస్తాడు. మరో వైపు రాజ్, కావ్యలను ఒకటి చేయడానికి వ్రతం పేరుతో మరో కొత్త ప్లాన్ వేస్తుంది ఇందిరాదేవి. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: రాజ్ భార్యను అంగీకరిస్తాడా..? అయోమయంలో పడిన కావ్య జీవితం.. టెన్షన్ లో ఇందిరాదేవి..!

Brahmamudi Serial: బెంగళూర్ నుంచి అనామిక ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ ముందు తన భర్త కళ్యాణ్ రైటర్ అని చెప్పుకోవడానికి నామూషి గా ఫీలైన అనామిక.. బిజినెస్ చూసుకుంటాడని లేని గొప్పలు చెప్పుకుంటుంది.

publive-image

ఇంతలో అక్కడికి వచ్చిన కళ్యాణ్ అసలు నిజం బయటపెడతాడు. తాను ఒక రైటర్ అని .. నా గురించి చెప్పడానికి నేనేమీ సాధించలేదు. మా బిజినెస్ లు అన్నీ చూసుకునేది మా అన్నయ్య రాజ్ అని అందరి ముందు భార్య పరువు తీస్తాడు.

publive-image
భర్త కళ్యాణ్ గురించి అబద్దాలు చెప్పడంతో అనామికకు గడ్డి పెడతారు తన ఫ్రెండ్స్. ఇలా అబద్దాలు చెప్పాల్సిన అవసరమేముంది..? మీ ఆయన చాలా నిజాయితీ పరుడు. అలాంటి భర్త దొరకడం నీ అదృష్టం అని అనామికకు బుద్ది చెబుతారు ఫ్రెండ్స్.

publive-image

ఫ్రెండ్స్ ముందు అవమానం జరగడంతో ఒళ్ళు మండిపోయిన అనామిక భర్త కళ్యాణ్ తో వాదిస్తుంది. 10 రోజుల్లో తాను రైటర్ గా ప్రూవ్ చేసుకోలేకపోతే.. తాను చెప్పింది చేయాలని ఛాలెంజ్ చేస్తుంది అనామిక.

publive-image

భర్తకు విడాకుల పేపర్స్ ఇచ్చిన కావ్య.. దాని గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. ఇంతలో ఆఫీస్ కు వచ్చిన రాజ్.. ఇంట్లో అందరితో ఒక విషయం చెప్పాలి, కావ్య కుటుంబం కూడా ఉండాలి అని పెద్ద చెప్తాడు. దీంతో విడాకులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాడని కావ్య, ఇందిరాదేవి టెన్షన్ పడతారు.

publive-image

కావ్య, రాజ్ ను ఒకటి చేయాలనీ నిర్ణయించుకున్న ఇందిరాదేవి వ్రతం పేరుతో కొత్త ప్లాన్ వేస్తుంది. భర్య భర్తలు ఇద్దరూ కలిసి దాంపత్య వ్రతం చేయాలనీ చెప్తుంది. ఈ వ్రతం పేరుతో రాజ్ లోని ప్రేమను బయట పెట్టాలని ప్లాన్ వేస్తుంది ఇందిరాదేవి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. అసలు రాజ్ భార్య ను అంగీకరిస్తాడా..? లేదా విడాకులకు ఒప్పుకుంటాడా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

publive-image

Also Read : Venkatesh Daughter’s Marriage : ఘనంగా వెంకటేష్ చిన్న కూతురి పెళ్లి.. వైరలవుతున్న ఫొటోలు

Advertisment
Advertisment
తాజా కథనాలు