Brahmamudi: కావ్య చేతిలో మోసపోయిన రాజ్.. రుద్రాణి కుట్రకు బలైన మాయ..!

మాయ ప్రవర్తన గమనించిన ఇందిరాదేవి ఆమె బిడ్డ త‌ల్లి కాదేమోనని అనుమానపడుతుంది. మరో వైపు అసలు మాయను కనిపెట్టడానికి కావ్య ఇంటి నుంచి బయలుదేరుతుంది. ఈ విషయం తెలుసుకున్న రుద్రాణి కావ్యను ఫాలో అవుతూ వెనకాలే వెళ్తుంది. ఇలా సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

Brahmamudi: కావ్య చేతిలో మోసపోయిన రాజ్.. రుద్రాణి కుట్రకు బలైన మాయ..!
New Update

Brahmamudi: మాయ విషయంలో అనామిక, కళ్యాణ్ మధ్య వాదం జరుగుతుంది. మీ వదిన ఇంకా ఈ ఇంటినే పట్టుకొని ఎందుకు వేలాడుతుంది. ఛి.. ఛి కావ్య స్థానంలో నేను గనుక ఉంటే ఇంట్లో నుంచి ఎప్పుడో వెళ్లిపోయేదాన్ని. నాకు అన్యాయం జరిగినందుకు మీ ఇంట్లో అందరి పై కేసు పెట్టేదాన్ని అని కావ్యను అవమానిస్తుంది.

publive-image

అనామిక కావ్య గురించి తప్పుగా మాట్లాడడంతో భార్య పై ఫైర్ అవుతాడు కళ్యాణ్. నీకు తెలిసింది పోలీస్ కేసు పెట్టడం మాత్రమే. బంధం తెంచుకోవ‌డానికి పొగ‌రుతో అనే నాలుగు మాట‌లు చాలు. అదే నిలబెట్టుకోవాలంటే ఎంతో స‌హ‌నం కావాల‌ని అది నీ వల్ల కాదు. నువ్వు కోటి జన్మలు ఎత్తిన మా వదినన మనసును అర్ధం చేసుకోలేవు అని అనామికకు బాగా గడ్డి పెడతాడు. దీంతో అనామిక రగిలిపోతూ ఉంటుంది.

publive-image

రాజ్ గదిలోకి వెళ్లాలని వేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో తట్టుకోలేకపోతుంది మాయ. దీంతో రుద్రాణి పెళ్లి చేసుకున్న కావ్యకే రాజ్ గదిలోకి వెళ్ళడానికి 6 నెలలలు పట్టింది. మరి నువ్వొచ్చి ఆరు రోజులు కూడా కాలేదు. ఎలా సాధ్యమవుతుంది అనుకున్నావు అని మాయతో చెప్తుంది.

publive-image

మరో వైపు రాజ్ మాయల పెళ్ళికి మూహూర్తం పెట్టించడానికి పంతులును పిలిపిస్తుంది అపర్ణ. మరో రెండు రోజుల్లో పెళ్ళికి మంచి ముహూర్తం ఉందని చెబుతాడు పంతులు. దీంతో మాయ‌, రుద్రాణి సంబ‌ర‌ప‌డ‌తారు. ఇక సుభాష్ మాత్రం రెండు రోజుల్లో ఎలాగైన ఈ నకిలీ మాయ బాగోతం బయటపెట్టాలని టెన్షన్ పడతాడు.

publive-image

పెళ్ళికి ముహూర్తం పెట్టించడంతో కంగారు పడతాడు రాజ్. న‌కిలీ మాయ‌ను ఇంటికి తీసుకురావ‌డమే కాకుండా నో అబ‌క్ష‌న్ స‌ర్టిఫికేట్‌పై సంత‌కం పెట్టావు అని కావ్య పై సీరియస్ అవుతాడు. మాయతో నా పెళ్లి జరగదని మాటిచ్చావు.. మర్చిపోయావా అని కావ్యను నిలదీస్తాడు. మాటే కదా ఎన్నైనా ఇస్తాం అంటూ రాజ్ ను ఆటపట్టిస్తుంది కావ్య. దీంతో రాజ్ కాస్త కంగారు పడతాడు.

publive-image

మరో వైపు అసలు మాయ అడ్రెస్స్ కనిపెట్టిన అప్పు... కావ్యకు ఫోన్ చేసి వెంటనే అక్కడికి రమ్మని చెప్తుంది. అక్కడే ఉన్న రుద్రాణి దొంగచాటుగా ఇందంతా వింటుంది. అసలు మాయను కావ్యకు దొరకకుండా చేయాలి అని ఆమెను ఫాలో అవుతూ వెళ్తుంది.

publive-image

బాబు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. మాయ బాబు ఏడుపు ఆపడానికి మాయ ఎంత ప్రయత్నించిన ఆపడు. మాయను చూడగానే ఇంకా ఏడవడం మొదలుపెడతాడు.

publive-image

ఇందంతా గమనిస్తున్న ధాన్యలక్ష్మి, ఇందిరాదేవికి అనుమానం వస్తుంది. అసలు నువ్వు బాబు తల్లివేనా అని మాయను నిలదీస్తారు. దీంతో అసలు నిజం ఎక్కడ బయటపడుతుంది అని భయపడిన మాయ తప్పంతా రాజ్ పై నెట్టేస్తుంది. ఇందంతా రాజ్ చేసిన తప్పే బాబును నాకు దూరం చేసి కావ్య‌కు ద‌గ్గ‌ర చేశాడు. ఇప్పుడు నా కొడుకే నన్ను గుర్తుపట్టలేకపోతున్నాడు అని నాటకం మొదలుపెడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ రుద్రాణి అసలు మాయను కారుతో యాక్సిడెంట్ చేస్తుంది.

publive-image

Also Read: Yevam Release Date: చాందిని చౌదరీ 'యేవమ్' రిలీజ్ డేట్ వచ్చేసింది..ఆరోజే విడుదల..? - Rtvlive.com

#brahmamudi-today-episode
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe