Brahmamudi: మాయ విషయంలో రుద్రాణి , రాహుల్ చేసిన కుట్రలను సాక్ష్యాలతో బయటపెడుతోంది కావ్య. దీంతో రుద్రాణికి దిమ్మతిరుగుతుంది. రౌడీలతో రుద్రాణి మాట్లాడిన ఫోన్ కాల్స్ అన్ని తన దగ్గర ఉన్నాయని రుద్రాణిని భయపెడుతుంది కావ్య. దీంతో రుద్రాణి సైలెంట్ అయిపోతోంది. కావ్య ముందు నోరు మూసుకొని ఉంటుంది.
సొంత కుటుంబానికి రుద్రాణి చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోయిన కావ్య ఆమెకు గట్టిగా క్లాస్ ఇస్తుంది. ఛీ ఇలా బతకడం ఓ బతుకేనా . మిమ్మల్ని ఇంట్లో నుంచి తరిమివేయడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు. కానీ మా అక్క కోసం ఆలోచిస్తున్నాను అని రుద్రానికి గడ్డి పెడుతుంది కావ్య.
మరో వైపు తనపై పడిన నిందలు తొలగిపోవడంతో సంతోషపడతాడు సుభాష్. ఆ తర్వాత భార్య అపర్ణ దగ్గరకు వెళ్లి మాట్లాడతాడు. ఇన్నాళ్లు నిన్ను మోసం చేశాననే బాధతో నీ కళ్ళలోకి సూటిగా చూడలేకపోయానని. నన్ను ఎప్పటికీ క్షమించవేమోనని భయపడ్డానని అపర్ణతో చెబుతాడు సుభాష్.
కానీ అపర్ణ మాత్రం సుభాష్ కు పెద్ద షాకిస్తుంది. నేను ఎప్పటికీ మిమల్ని క్షమించను. కొడుకు ముందు మీ పరువు తీయకూడదని అలా నవ్వుతూ కనిపించాను. మనం సంతోషంగా ఉండాలని కావ్య ఎంతో కష్టపడింది. అందుకే వాళ్ళ ముందు క్షమించినట్లు నటించాను అని సుభాష్ పై ఫైర్ అవుతుంది.
ఇక మాయ సమస్య తొలగిపోయిందని సంతోషంగా ఉంటాడు రాజ్. బెడ్ రూమ్ లో ఉన్న కావ్య దగ్గరకు సంతోషంగా వెళ్తాడు. వెనుక నుంచి వచ్చి కావ్యను భయపెడతాడు రాజ్. దీంతో ఉలిక్కిపడ్డ కావ్య మీరీనా..? అని విచారంగా అంటుంది.
మరో వైపు మీ చిన్న కూతురు లాడ్జిలో దొరికిందటగా...డబ్బున్న వాడినే పట్టిందిగా అని కనకం ఇంటికి వచ్చి అవమానిస్తారు చుట్టు పక్కల వాళ్ళు.
ఇలాంటి తిరుగుళ్లు తిరిగితే ఎవరు పెళ్లిచేసుకుంటారు. ఇలా అప్పును ఊరు మీద వదిలేస్తే ఎలా అని కనకాన్ని నానా మాటలు అంటారు.
ఇక తన కూతుళ్ళ గురించి తప్పుగా మాట్లాడంతో కోపంతో తట్టుకోలేకపోయిన కనకం వారి జుట్లు పట్టుకొని చెడామడా వాయిస్తుంది. కృష్ణమూర్తి అడ్డుపడిన పట్టించుకోకుండా చీపురు పట్టుకొని వాళ్ళను బాదుతుంది.
ఇంతలో కళ్యాణ్ అక్కడికి వస్తాడు. కళ్యాణ్‌ను చూడగానే ముఖం పై తెలుపు వేస్తుంది కనకం. ఇక కళ్యాణ్ మాత్రం జరిగిన దాంట్లో మన తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలి అప్పు తలుపు తెరువు అని బతిమిలాడుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.