Brahmamudi: రాజ్, కావ్యకు షాకిచ్చిన అపర్ణ.. అసూయతో రగిలిపోతున్న రుద్రాణి, అనామిక..! అపర్ణ కోడలు కావ్య, ఆమె తల్లిదండ్రుల పై చూపిస్తోన్న ప్రేమ, గౌరవం చూసి తట్టుకోలేకపోతుంది రుద్రాణి. ఎలాగైన కావ్య పై అపర్ణ ప్రేమను చంపేయాలని కుట్ర చేస్తుంది. మరో వైపు భర్త మోసాన్ని తట్టుకోలేకపోతున్న అపర్ణ అతనితో కలిసి పూజ చేయడం కుదరదు అని చెప్తుంది. By Archana 17 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi: భార్య అపర్ణ ఆరోగ్యం బాగుండాలని ఇంట్లో పూజ ఏర్పాట్లు చేయిస్తాడు సుభాష్. కానీ భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతున్న అపర్ణ అతనితో కలిసి పూజ చేయడం కుదరదు అని చెప్తుంది. నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లిన మనిషి నా కోసం పూజలో చేయడం ఏంటీ..? నేను చనిపోయిన పర్వాలేదు పూజ మాత్రం జరగదు అని ఆపాల్సిందేనని పట్టుపడుతుంది. మరో వైపు పూజ ఆపితే అశుభం అని కోడలు అపర్ణకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది ఇందిరాదేవి. దీంతో అపర్ణ.. పూజలో తన కొడుకు, కోడలు కూర్చుంటారని తన నిర్ణయాన్ని చెబుతుంది. దీంతో అందరు షాక్ అవుతారు. అపర్ణ కావ్యను కోడలిగా ఒప్పుకోవడంతో సంతోషపడతారు. ఇక అపర్ణ కోసం రాజ్, కావ్య పూజలో కూర్చుంటారు. ఇక కావ్య, ఆమె తల్లిదండ్రుల పై అపర్ణ చూపిస్తున్న ప్రేమ, గౌరవాన్ని చూసి తట్టుకోలేకపోతుంది అపర్ణ. ఎలాగైన అపర్ణకు కావ్య పై ఉన్న ప్రేమను చంపేయాలని కుట్ర చేస్తుంది. మరో వైపు అనామిక తల్లిదండ్రులు కూడా కావ్య పై అపర్ణ చూపిస్తున్న ప్రేమను చూసి అసూయ పడతారు. అపర్ణ పైకి కోపంగా కనిపిస్తున్న లోపల మాత్రం కోడలి పై విపరీతమైన ప్రేమను పెంచుకుంది అని అనామికను తో చెప్తారు. నువ్వు మాత్రం ఇంటికి వచ్చినప్పటి నుంచి గొడవలు తప్పా సాధించింది ఏమీ లేదని అనామికను రెచ్చగొడతారు. అపర్ణలో వచ్చిన మార్పును మార్పును చూసి కావ్య అమ్మ, నాన్న సంతోషపడతారు. కూతురి పై అత్త చూపిస్తోన్న ప్రేమను చూసి పొంగిపోతారు. ఎప్పుడు గుండెబారంతో వెళ్లిపోయేవాళ్లం. మొదటి సారి మీ అత్త నీ పై చూపుతున్న ప్రేమను చూసి తృప్తిగా వెళుతున్నాం అని కావ్యతో ఎమోషనల్ అవుతారు కనకం, కృష్ణమూర్తి. ఆ తర్వాత కావ్య, రాజ్.. సుభాష్, అపర్ణ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సుభాష్, అపర్ణ మధ్య దూరం మరింత పెరుగుతోందని భర్తతో బాధపడుతూ చెబుతుంది కావ్య. మరో వైపు సుభాష్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రాజ్, కావ్య సుభాష్ ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అత్తయ్యకు దూరంగా ఉంటే మీ మధ్య దూరం మరింత పెరుగుతుంది. మీ మనసులోని బాధను ధైర్యంగా చెబితే అత్తయ్య మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది అని మావయ్య సుభాష్ కు సలహా ఇస్తుంది కావ్య. కోడలి సలహా ప్రకారం సుభాష్ అపర్ణతో మాట్లాడడానికి వస్తాడు.తనను క్షమించమని అడుగుతాడు. కానీ అపర్ణ మాత్రం.. ఇంతకాలం ఓ దారుణమైన నిజాన్ని దాచి.. నన్ను అబద్ధంలో బతికేలా చేశారు. మీరు చెప్పేదేది నేను వినని భర్త పై ఫైర్ అవుతుంది అపర్ణ. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. Also Read: Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం 'గరం గరం' సాంగ్ .. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్..! - Rtvlive.com #brahmamudi-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి