Brahmamudi Serial: రచ్చ రచ్చ చేసిన అనామిక .. కావ్యకు రాజ్ షాకింగ్ వీడియో..!

బ్రహ్మముడి సీరియల్ ‌లో కల్యాణ్, అనామిక శోభనం గొడవ పెద్ద రచ్చ అయింది. చేయని తప్పుకు ఎందుకు నిందిస్తున్నారంటూ ధాన్యలక్ష్మీ పై కావ్య తిరగబడింది. ఇదిలా ఉండగా.. భర్త రాజ్ శ్వేతతో ఉన్న వీడియోను గుర్తి తెలియని వ్యక్తి కావ్యకు పంపించడంతో ఆమె షాక్ అవుతుంది.

New Update
Brahmamudi Serial: రచ్చ రచ్చ చేసిన అనామిక .. కావ్యకు రాజ్ షాకింగ్ వీడియో..!

Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్‌ లో కళ్యాణ్ , అనామిక శోభనం రచ్చ రచ్చ అవుతుంది. ప్రతిసారి కావ్య (Kavya), అప్పు టాపిక్ తెస్తున్నాడని అనామిక భర్త కళ్యాణ్ తో గొడవ పడుతుంది. అనామిక ప్రవర్తనపై రాజ్ (Raj) కూడా సీరియస్ అవుతాడు. ఎంత ఒపికగా ఉంటున్న నన్ను రెచ్చగొడుతున్నావ్ అనామిక అంటూ ఫైర్ అవుతాడు. దీంతో, అనామిక బెడ్ పై ఉన్న ఫ్లవర్స్ అన్ని చెల్లాచెదురు చేసి సోఫాలో పడుకుంటుంది.

publive-image

మరోవైపు స్వప్న తన అత్తను టార్చర్ చేస్తుంది. పదే పదే ఫోన్ చేసి పనులు చేయమని చెబుతుంది. లేదంటే పోలీసు కంప్లైంట్ ఇస్తా అంటూ బెదిరిస్తుంది. అయితే, స్వప్న లాగా ఉంటేనే తన అత్తకు కరెక్ట్ గా సరిపోతుందంటూ సీరియల్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇంట్లో అందరి మధ్య అత్త రుద్రాణి చిచ్చు పెడితే.. రుద్రాణి కోడలు స్వప్న మాత్రం తన అత్తను అడుకుంటుంది.

publive-image

అనామిక సోఫాలో పడుకోవడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. దీంతో అనామిక కావ్యపై అప్పుపై కంప్లైంట్ చేస్తుంది. అప్పును ప్రేమ దేవతల కొలుస్తాడని..వదినను ఇలవేల్పులా కొల్తుస్తాడని.. భార్యగా నాకు విలువ ఇవ్వడం లేదని ఏడుస్తూ చెబుతుంది. దీంతో, అత్త ధాన్యలక్ష్మీ కావ్యపై విరుచుకుపడుతుంది. నా కొడుకు కోడలు వీడిపోయే వరకు నువ్వు సంతోషంగా ఉండాలేవా? అంటూ దుయ్యబడుతుంది. కావ్యను తిట్టడంతో రాజ్ అండగా నిలబడుతాడు. పిన్నికి ఎదురుతిరుగుతాడు. కావ్య కూడా ఓపిక నశించి చిన్నత్తకు ఎదురు సమాదానం చెబుతుంది.

Brahmamudi Serial Kavya

ఇదిలా ఉండగా ఈ రోజు ఎపిసోడ్ లో కావ్యకు మిడ్ నైట్ ఫోన్ వస్తుంది. రాజ్ సార్ ఎక్కడ మేడం అంటూ తన భర్త అసిస్టెంట్ కావ్యకు కాల్ చేస్తుంది. ఆయన ఆఫీస్ లోనే ఉన్నారు కదా? అంటుంది. లేరు మేడం సార్ ఆఫీస్ కు రాలేదని చెబుతుంది. రేపు మార్నింగ్ లోపు డిజైన్స్ రెడీ చేయాలి..సార్ ఏమో రాలేదంటూ చెప్పడంతో నాకు మెయిల్ చెయి నేను వేస్తా అని కావ్య అంటుంది. మరోవైపు రాజ్ ఏమో శ్వేత దగ్గర ఉంటాడు. అయితే, గుర్తు తెలియని వ్యక్తి రాజ్ శ్వేతతో ఉన్న వీడియోను కావ్యకు పంపిస్తారు. అది చూసిన కావ్య షాక్ అవుతుంది.

Brahmamudi Serial

Also Read:  ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్.. మీరు ఓ లుక్కేయండి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు