Brahmamudi Serial : భార్యను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న కళ్యాణ్.. కావ్య పై అనామిక నిందలు

భర్త కళ్యాణ్ అబద్దాలు చెప్పి తనను మోసం చేశాడని ఇంట్లో పెద్ద పంచాయతీ పెడుతుంది అనామిక. భార్య ప్రవర్తనకు విసుగెత్తిపోయిన కళ్యాణ్.. 'నా కవితలు ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటూ అనామికకు వార్నింగ్ ఇస్తాడు'. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Brahmamudi Serial : భార్యను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న కళ్యాణ్.. కావ్య పై అనామిక నిందలు
New Update

Brahmamudi Serial Today Episode : ఆఫీస్ లో కళ్యాణ్(Kalyan) కవిత(Kavitha) ల భాగోతం గురించి తెలిసిన అనామిక.. భర్త ఇంటికి రాగానే కడిగిపారేయాలని కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్, కావ్య, రాజ్(Raj) ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు.

Anamika

కళ్యాణ్ రాగానే అందరి ముందు రచ్చ మొదలుపెడుతుంది అనామిక. నువ్వేమైనా కవి పుంగవా..? ఆఫీస్ కు వెళ్లి గొప్పవాడివి అవుతావు అనుకుంటే.. కవి సమ్మేళనం మొదలు పెట్టావు. అబద్దాలు చెప్పి నన్ను మోసం చేశావు అంటూ అందరి ముందు కళ్యాణ్ పై రెచ్చిపోతుంది.

Brahmamudi Serial - Anamika
భర్త పై అనామిక(Anamika) రెచ్చిపోవడం నచ్చని రాజ్.. ఆఫీస్ లో కూడా కళ్యాణ్ ను చాలా మాటలు అన్నావు.. ఇక చాలు ఆపేయ్ అంటూ వార్నింగ్ ఇస్తాడు. కావ్య కూడా కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. తోడి కోడలు పై అసూయతో రగిలిపోతున్న.. నా భర్త ఇలా తయారు కావడానికి నువ్వే కారణం. మీరు మాత్రం గొప్పవాళ్ళుగా అందళం ఎక్కాలని చూస్తున్నారు.. నా భర్తనేమో కవితల పిచ్చొడ్ని చేస్తున్నారు అంటూ కావ్య విరుచుకుపడుతోంది.

Raj - Kavya

అనామిక ప్రవర్తనతో విసిగిపోయిన కళ్యాణ్.. ఇప్పటికే చాలా మాట్లాడావు.. ఇప్పుడు నేనే చెప్పేది విను అని అంటాడు. నీకు నేను కవితలు రాయడం అంత ఇబ్బందిగా ఉంటే.. మొహమాటం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చు అని తెగేసి చెప్తాడు. అంతే కాదు నీకు నచ్చినట్లు నేను బ్రతకను.. నాకు నచ్చినది మాత్రమే చేస్తాను అంటూ అనామికను గడ్డిపెడతాడు కళ్యాణ్.

Kalyan
భర్త మాటలకు హార్ట్ అయిన అనామిక అక్కడి నుంచి కోపంగా బెడ్ రూమ్ కు వెళ్తుంది. బాధతో రూమ్ లోకి వచ్చిన కళ్యాణ్.. ఈరోజు నీ పై ఉన్న ప్రేమను ఒక కవిత రూపంలో రాసి నీకు అవ్వాలని అనుకున్నాను. కానీ కవితల పట్ల నీకున్న అభిప్రాయాన్ని చూసిన తర్వాత.. ఈ కవిత చదివే అర్హత కూడా నీకు లేదని అర్థమైంది అంటూ అనామిక కోసం రాసిన కవితను బయటకు పడేస్తాడు.

Kalyan - Anamika
కళ్యాణ్ కవిత రాసిన పేపర్ బయట పడేయడం గమనించిన కావ్య(Kavya).. అది తీసుకొని కవితను చదువుతుంది. కవితలో భార్య పై కళ్యాణ్ ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత అనామికను కళ్యాణ్ కవితల గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అనామిక మాత్రం అదే అసూయ బుద్దితో కావ్య మాటలు లెక్క చేయదు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Kavya - Anamika

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

#brahmamudi-serial-today-episode #daily-serial #tv-serial
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe