Brahmamudi Serial: కావ్యను ప్రేమిస్తున్నాని చెప్పేసిన రాజ్.. ఆఫీస్ లో కళ్యాణ్ బండారం బయట పెట్టిన అనామిక

వాలెంటైన్స్ డే సందర్భంగా రాజ్ తన భార్య కావ్యకు అందరి ముందు లవ్ ప్రపోజ్ చేస్తాడు. మరో వైపు ఆఫీస్ లో భర్త కళ్యాణ్ కవితల నిర్వాకం గురించి తెలుసుకున్న అనామిక ఇంట్లో రచ్చ చేస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: కావ్యను ప్రేమిస్తున్నాని చెప్పేసిన రాజ్.. ఆఫీస్ లో కళ్యాణ్ బండారం బయట పెట్టిన అనామిక

Brahmamudi Serial: కావ్య బావ చేసిన ప్లాన్ తెలియని రాజ్.. నిజంగానే రెస్టారెంట్ తన భార్యకు ప్రపోజ్ చేయడానికి వచ్చాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. వాలెంటైన్స్ డే అడ్డం పెట్టుకొని వాడు.. నా భార్యకు ప్రపోజ్ చేయడానికి తీసుకొచ్చాడు అంటూ కావ్య బావ పై కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

publive-image

రాజ్ ప్రవర్తనను గమనించిన శ్వేత.. నీ భార్యకు విడాకులు ఇవ్వాలని ఫిక్స్ అయినప్పుడు.. తాను ఏం చేస్తే నీకు ఎందుకు అని రాజ్ ను ప్రశ్నిస్తుంది. నువ్వు వెళ్ళిపో అన్నావు.. అందుకే తన జీవితం తాను చూసుకుంది. నువ్వు వద్దన్నావని ఏడుస్తూ కూర్చోవాలా..? ఏంటీ అని రాజ్ ను నిలదీస్తుంది. కావ్య తన బావా లవ్ యాక్సెప్ట్ చేయాలనీ నేను కూడా కోరుకుంటానని రాజ్ ను ఇంకా రెచ్చగొడుతుంది శ్వేత. దీంతో రాజ్ నేను విడాకులు ఇవ్వలేదు కదా.. ఎలా ప్రపోజ్ చేస్తాడు అని కోప్పడతాడు.

publive-image
ఇంతలో రాజ్ నాన్నమ్మ, తాతయ్య అక్కడికి రావడంతో షాకైన కావ్య.. వాళ్ళు వస్తున్నారని తన బావతో చెప్తుంది. దీంతో నేనే వాళ్ళను రమ్మనాని చెబుతాడు కావ్య బావ.

publive-image
ఇందిరాదేవి, సీతారామయ్య అక్కడికి రావడం చూసిన రాజ్.. వెంటనే కావ్య దగ్గరికి వెళ్తాడు. ప్లాన్ అంతా తెలిసిన ఇందిరాదేవి.. ఏమీ తెలియనట్లు.. రాజ్ మీరు కూడా ఇక్కడికే వచ్చారా ..? ఎందుకు కావ్యకు ప్రపోజ్ చేయాలనీ తీసుకొచ్చావా అని అడుగుతుంది. పాపం వీళ్ళ డ్రామాలు తెలియని రాజ్.. నిజంగానే కావ్యకు ప్రపోజ్ చేయాలనీ ఇక్కడకు వచ్చినట్లు నటిస్తాడు.

publive-image
కావ్య పై రాజ్ ప్రేమను బయట పెట్టాలని నిర్ణయించుకున్న ఇందిరాదేవి, సీతారామయ్య.. అందరి ముందు మా మనవడు తన భార్యకు లవ్ ప్రపోజ్ చేస్తాడని చెబుతారు. చేసేదేమీ లేక అందరి ముందు కావ్యకు ప్రపోజ్ చేస్తాడు.

publive-image

కావ్యను తన బావతో రెస్టారెంట్ లో చూసిన రాజ్ జెలసీగా ఫీల్ అవుతాడు. కారులో వెళ్తుండగా మీ బావ నీకు లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడా అంటూ కావ్యను ప్రశ్నిస్తాడు. దీంతో రాజ్ ఉడికించాలని నిర్ణయించుకున్న కావ్య.. అవును పానకంలో పుడకలా మీరు రాకపోతే మా బావ నాకు ఐ లవ్ యు చెప్పేవాడు అని అంటుంది.

publive-image

మరో వైపు అనామికకు లేని పోనీ అనుమానాలు క్రియేట్ చేస్తుంది రుద్రాణి. నీ భర్త ఆఫీస్ కు వెళ్లి ఏం చేస్తున్నాడో తెలుసుకో అంటూ రెచ్చగొడుతుంది. రుద్రాణి మాటలు విని ఆఫీస్ కు వెళ్లిన అనామికకు.. ఆఫీస్ లో తన భర్త చేస్తున్న నిర్వాకం గురించి తెలిసిపోతుంది. కళ్యాణ్ ఆఫీస్ కు వెళ్లి కవితలు చెప్తున్నాడు అని తెలుసుకున్న అనామిక రగిలిపోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: This Week Theatre Releases: ఈ వారం థియేటర్ లో అదిరిపోయే చిత్రాలు.. అందులో స్టార్ కమెడియన్ సినిమా కూడా..

Advertisment
Advertisment
తాజా కథనాలు