Brahmamudi Serial : కావ్య చేష్టలకు కుళ్ళి కుళ్ళి చస్తున్న భర్త.. రాజ్ పై అనామిక మాస్టర్ స్కెచ్ కావ్య తన బావతో సరదాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేకపోతున్న రాజ్.. కావాలనే వాళ్ళను డిస్టర్బ్ చేస్తాడు. మరో వైపు దుగ్గిరాల కుటుంబానికి తానే కింగ్ మేకర్ అవ్వాలని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది అనామిక. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Archana 23 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi Serial : కావ్య(Kavya) తన బావ ఇద్దరు.. బయట సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. భార్య(Wife) ను అలా చూసి జెలసీతో కుళ్ళుకుంటున్న రాజ్.. కావాలనే వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి వెళ్తాడు. చెప్పిన కబుర్లు చాలు.. నాకు తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకొని రా అని కావ్య చెప్తాడు రాజ్. భర్తను ఇంకా ఉడికించాలని ప్లాన్ చేసిన కావ్య.. నేను మా బావతో కబుర్లు చెప్పుకోవాలి.. కాఫీ ఇవ్వడం కుదరదు అని చెప్తుంది. ఎసై కావాలని నిర్ణయించుకున్న అప్పు.. రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తుంది. అక్కడ అప్పుకు ఒక పోలీస్ ఆఫీసర్ పరిచయం అవుతాడు. దీంతో అప్పు తన పోలీస్ ట్రైనింగ్(Police Training) కోసం అతడి సహాయం కోరుతుంది. ఉదయాన్నే కావ్య కాఫీ కప్పు పట్టుకొని హడావిడిగా కనిపిస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రాజ్.. ఏంటీ నాకు కాఫీ ఇవ్వడానికి ఇంత హడావిడి చేయాలా అని అంటాడు. దీంతో కావ్య.. ఇది మీ కోసం కాదు.. బయట మా బావ వర్క్ ఔట్స్ చేస్తున్నాడు.. తన కోసం తీసుకెళ్తున్నానని చెబుతుంది. కావ్య ఇలా చెప్పగానే.. కోపంతో రగిలిపోతాడు రాజ్(Raj). మరో వైపు అనామిక(Anamika).. దుగ్గిరాల ఇంటికి తానే అధిపతి కావాలని.. వాళ్ళ అమ్మతో కలిసి కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. ఎలాగైన రాజ్ ను తప్పించి.. కళ్యాణ్(Kalyan) కు ఆఫీస్ బాధ్యతలు అప్పగించాలని కుట్ర చేస్తుంది. ఇది విన్న రుద్రాణి.. అనామికకు సహాయంతో రాజ్ ను తప్పించి నా.. కొడుకును ఈ ఇంటికి కింగ్ ను చేస్తానని మరో మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇందిరాదేవి(Indira Devi) కి మెడ పట్టేయడంతో.. కావ్య బావ సెట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది చూసిన కావ్య.. మా బావకు ఎన్ని తెలివితేటలో అని రాజ్ ముందు పొగడడం మొదలు పెడుతుంది. కావ్య బావ పురాణం తట్టుకోలేకపోతున్న రాజ్.. నీ బావ మా నాన్నమ్మ మెడలు విరిచేసాలా ఉన్నాడు అంటూ వెటకారం చేస్తాడు. రాజ్ డ్రామాకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న కావ్య.. కావాలనే భర్త ముందు.. తన బావను పొగిడేస్తూ ఉంటుంది. ఎంతిచ్చాడు పొగడడానికి అని వెటకారం చేస్తాడు రాజ్. దీంతో కావ్య.. మిమల్ని కూడా పొంగిన మీరు ఏమి ఇచ్చారు విడాకులు తప్పా అని రాజ్ ను ఆడుకుంటుంది. ఈ విషయం మా బావకు తెలిస్తే.. మా ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు అని చెప్తుంది. దీంతో రాజ్ షాకవుతాడు. కావ్య తన బావను నిజంగానే పెళ్లి చేసుకుంటుందేమో అని భయపడిన రాజ్.. విడాకుల గురించి మీ బావతో చెప్పకు అని చెప్తాడు. ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలని చెప్తాడు. ఆ తర్వాత కావ్య బావ ముందు గొప్పలకు పోయిన రాజ్.. ఆసనాలు చేస్తాడు . దీంతో రాజ్ మెడ పట్టేసుకుంటుంది. ఇది గమనించిన కావ్య.. మనసులో నవ్వుకుంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. Also Read : Bellamkonda Sreenivas : తెలుగులో ఫ్లాప్.. అక్కడ మాత్రం సూపర్ హిట్ #brahmamudi-serial-today-episode #daily-serial #tv-serial మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి