/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-20-jpg.webp)
Brahmamudi Serial Today Episode: కళ్యాణ్, అనామిక ఇద్దరు షాపింగ్ చేయడానికి కారులో వెళ్తుండగా.. అప్పు ఎదురవుతుంది. అప్పును చూడగానే.. కళ్యాణ్ (Kalyan) వెళ్లి పలకరిస్తాడు. ఇది చూసి ఒళ్ళు మండిన అనామిక (Anamika).. నా భర్తకు దూరంగా ఉండమని అప్పుకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో అప్పు కూడా రివర్స్ కౌంటర్ వేస్తుంది. నీ భర్తను నా సొంతం చేసుకోవడం నాకు పెద్ద విషయమేమీ కాదు.. నన్ను రెచ్చగొట్టి నీ కాపురాన్ని నాశనం చేసుకోకు అని రివర్స్ వార్నింగ్ ఇస్తుంది.
మరో వైపు బావను రిసీవ్ చేసుకోవడానికి.. ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన కావ్య ఎంత సేపటికీ రాకపోయేసరికి రాజ్ కంగారు పడుతూ ఉంటాడు. అసలు ఆ బావ ఎవరా..? అని అటు ఇటూ తిరుగుతూ తెగ టెన్షన్ పడిపోతాడు. ఇంతలో బయట కారు ఆగడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి చూస్తాడు. కారు నుంచు స్టైల్ గా కావ్య (Kavya) బావ దిగడం చూసి రాజ్ మొహం మాడిపోతుంది.
అమెరికా నుంచి వచ్చిన బావను కావ్య.. తన భర్త రాజ్ కు పరిచయం చేస్తుంది. కావ్య బావ కావాలనే రాజ్ అన్నయ్య అని పిలుస్తూ వెటకారం చేస్తాడు. బుట్టబొమ్మ లాంటి మా బుజ్జి దొరకడం నీ అదృష్టం అని కావ్యను పొడుగుడుతాడు. కావ్యను నువ్వు పెళ్లి చేసుకోకపోతే.. నేను చేసుకొని హాయిగా అమెరికా తీసుకెళ్ళేవాడిని అంటూ మాట్లాడతాడు. కావ్య కూడా ఇలాగే అనడంతో.. రాజ్ అక్కడి నుంచి సీరియస్ గా వెళ్ళిపోతాడు.
భర్త ప్రేమను గెలవడానికి నువ్వు.. వెళ్తున్న దారి కరెక్టేనా అని మరదల్ని ప్రశ్నిస్తాడు కావ్య బావ. దీని వల్ల నీకు చెడ్డ పేరు అయితే రాదు కదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు. అలా ఏం జరగదు.. ఆయనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అని దైర్యం చెప్తుంది.
కావ్య తన బావతో ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న రాజ్ డోర్ బయట నిలబడి అటు ఇటూ తిరుగుతూ.. టెన్షన్ పడుతుంటాడు.
మరో వైపు శ్వేతకు విడాకులు వచ్చిన సందర్భంగా.. కేక్ కట్టింగ్ ప్లాన్ చేస్తాడు రాజ్. శ్వేత వద్దంటున్న కావాలనే కావ్యను కూడా పిలుస్తాడు. అక్కడికి వచ్చిన కావ్య బావ.. ఫ్రెండ్ విడాకులు వస్తే సెలెబ్రేట్ చేసుకోవడం ఏంటని రాజ్ పై సెటైర్స్ వేస్తాడు. దీనికి రాజ్ శ్వేతను నేను ఒంటరిగా ఉండనివ్వను.. నేను తోడుగా ఉంటానని అంటాడు. ఇంతలో కావ్య .. భార్యను వద్దనుకున్న భర్తతో కలిసి ఉండాల్సిన.. ఖర్మ ఎవరికీ లేదని రాజ్ పై మాటల యుద్ధం మొదలు పెడుతుంది.
ఆ తర్వాత కావ్య తన బావతో కలిసి బయటకు వెళ్లాలని.. రాజ్ ను 2 గంటలు పర్మిషన్ అడుగుతుంది. భార్య వెళ్లడం ఇష్టం లేని రాజ్ ఆఫీస్ లో పని ఉందని సాకులు చెప్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read : Saindhav OTT Release : వెంకటేష్ సైంధవ్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది