Brahmamudi Serial: భర్తను వదిలేయాలనుకున్న కావ్య.. రాజ్ ప్రేమ బయట పెట్టేందుకు ఇందిరాదేవి ప్లాన్

భర్త రాజ్ జీవితంలో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది కావ్య. మరో వైపు ఇందిరాదేవి కావ్య పై రాజ్ ప్రేమను బయటకు తెప్పించడానికి సూపర్ ప్లాన్ వేస్తుంది. ఇక కావ్య పై దొంగతనం ముద్ర వేసిన రుద్రాణి, ధాన్యలక్ష్మికి స్వప్న దిమ్మతిరిగే షాకిస్తుంది. ఇలా సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: భర్తను వదిలేయాలనుకున్న కావ్య.. రాజ్ ప్రేమ బయట పెట్టేందుకు ఇందిరాదేవి ప్లాన్

Brahmamudi Serial: భర్త మనసులో స్థానం లేదని తెలుసుకున్న కావ్య.. రాజ్ జీవితం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఇందిరాదేవి మాత్రం కావ్యకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. సమస్యను పరిష్కరించుకోవాలి అంతే కానీ తప్పుకోవడం సరైనది కాదని ఇందిరాదేవి చెబుతుంది. publive-image
ఇక కావ్య నేను ఏం తప్పు చేశాను.. నాకు అందం లేదా, చదువు లేదా, సంస్కారం లేదా ఎందుకు నన్ను వదిలేయాలని ఆయన అనుకుంటున్నారు అంటూ ఇందిరాదేవిని ప్రశ్నిస్తుంది. రాజ్ కు నీపై చాలా ప్రేమ ఉంది.. కానీ అది బయట పెట్టడానికి వాడికి ఈగో అడ్డొస్తుంది అని ఇందిరాదేవి చెబుతుంది. ఆ ప్రేమను బయటకు తీసుకురావడానికి ఏం చేయాలో అర్ధం కావట్లేదు అని ఇందిరాదేవితో బాధపడుతుంది.

publive-imageకావ్య బాధను అర్థం చేసుకున్న ఇందిరాదేవి సూపర్ ప్లాన్ వేస్తుంది. ముళ్ళను, ముళ్ళుతోనే తీయాలి.. రాజ్ ఒక అమ్మాయిని అడ్డుగా పెట్టుకొని నిన్ను దూరం చేసుకోవాలని అనుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఒక అబ్బాయితో ప్రేమగా ఉన్నట్లు నటిస్తే అప్పుడు రాజ్ లో ప్రేమ బయటపడుతుందని చెప్తుంది.

publive-image
ఇది వినగానే కావ్య.. ఇలా చేయడం తనకు ఇష్టంలేదని చెబుతుంది. పరాయి వ్యక్తితో ప్రేమ నటిస్తే నా క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది.. దీనికి ఒప్పుకోనని అంటుంది. దానికి ఇందిరాదేవి నీ భర్త ప్రేమను పొందడానికి ఇలా చేయడం తప్పేమీ కాదు.. నీ పై ఎలాంటి నింద రాకుండ నీ వెనుక నేను ఉన్నాని ఇందిరాదేవి దైర్యం చెబుతుంది. కావ్య నాన్న మూర్తి కూడా దీనికి సపోర్ట్ చేస్తాడు. దీంతో కావ్య ఒప్పుకుంటుంది. ఆ తరువాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు.

publive-image

మరో వైపు కావ్య ఇంటికి రాగానే.. ధాన్యలక్ష్మి, రుద్రాణి వెటకారంగా మాట్లాడడం మొదలు పెడతారు. ఇంటికి రాగానే మీ పంచాయితీ ఏంటని కోప్పడుతుంది కావ్య. దానికి ధాన్యలక్ష్మి ఇంటి తాళాలు చేతికి రాగానే 2 లక్షలు తీసుకెళ్లి పుట్టింటికి ఇచ్చి వస్తున్నావు అని కావ్య పై నింద వేస్తుంది.

publive-image
అసలు ఏం జరిగిందో అర్థం కానీ కావ్య షాక్ లో ఉంటుంది. ఇటు అపర్ణ కూడా 2 లక్షల గురించి కావ్యను మందలిస్తుంది. ఏ తప్పు చేయని కావ్య అందరు అలా అనడంతో మౌనంగా నిలబడుతుంది.

publive-image
ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్న.. కావ్య పై దొంగతనం నింద వేసిన ధాన్యలక్ష్మిని కడిగిపారేస్తుంది. ఇక కావ్య పై నింద పడకూడదని భావించిన స్వప్న.. 2 లక్షలు తన కోసం ఇచ్చిందని అపర్ణకు చెబుతుంది. స్వప్న అలా చెప్పగానే రుద్రాణి, అనామికలు షాక్ అవుతారు. ప్లాన్ బెడిసికొట్టడంతో కోపంతో రగిలిపోతారు. ఇక స్వప్న కౌంటర్ తో ధాన్యలక్ష్మి నోరు కూడా మూతపడుతుంది. ఇంతటితో ఈరోజు సీరియల్ ముగుస్తుంది.

publive-image

Also Read: OTT Trending Movies: ఓటీటీలో టాప్ 3 ట్రేండింగ్ మూవీస్.. చివరిలో స్థానంలో ఆ సినిమానే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు