Brahmamudi serial: రుద్రాణి, అనామికలకు దిమ్మతిరిగే షాకిచ్చిన అపర్ణ.. కోపంతో రగిలిపోతున్న అనామిక

అపర్ణ ముందు కావ్యను దోషిగా నిలబెట్టాలనుకున్న అనామిక, రుద్రాణి ప్లాన్ బెడిసికొడుతుంది. మరో వైపు రాజ్ ఆఫీస్ కు రాకపోవడంతో కావ్య క్లైంట్ మీటింగ్ అటెండ్ అవుతుంది. కావ్య ప్రెసెంటేషన్ కు ఫిదా అయిన క్లైంట్స్ ప్రాజెక్ట్ ఒకే చేస్తారు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Brahmamudi serial: రుద్రాణి, అనామికలకు దిమ్మతిరిగే షాకిచ్చిన అపర్ణ.. కోపంతో రగిలిపోతున్న అనామిక
New Update

Brahmamudi serial: ఆఫీస్ లో క్లైంట్ మీటింగ్ పెట్టుకొని.. రాజ్ ఇంకా ఆఫీస్ కు రాకపోవడంతో సుభాష్ టెన్షన్ పడుతుంటాడు. ఇంకా ఆఫీస్ కు రాకపోవడం ఏంటని అందరి పై ఫైర్ అవుతూ ఉంటాడు. ఇటు కావ్య కాల్ చేసిన సరే రాజ్ మాత్రం కావాలనే లిఫ్ట్ చేయకుండా.. లైట్ తీసుకుంటాడు రాజ్. publive-imageచాలా సమయం నుంచి క్లైంట్స్ వెయిట్ చేస్తుండడంతో ఏం చేయాలి అని టెన్షన్ పడుతుంటాడు సుభాష్. ఇంతలో శృతి.. సార్ కావ్య మేడం కు ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం తెలుసా.. అందుకని కావ్య మేడం ప్రెసెంటేషన్ ఇస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ అని సుభాష్ కు ఐడియా ఇస్తుంది. ఇది వినగానే సుభాష్ తన కోడలు కావ్యనే ప్రెసెంటేషన్ ఇవ్వమని ఆర్డర్ వేస్తాడు.

publive-image
మావయ్య సుభాష్ మాట కోసం.. క్లైంట్స్ ముందు కావ్య ప్రెసెంటేషన్ ఇస్తుంది. కావ్య డిజైన్స్ గురించి అద్భుతంగా వివరించడంతో క్లైంట్స్ బాగా ఇంప్రెస్ అవుతారు. ప్రాజెక్ట్ ఒకే కావడంతో సుభాష్, ప్రకాశం సంతోషంగా ఉంటారు. అందరు కావ్యను మెచ్చుకుంటారు.

publive-image
ఇటు కావ్య ప్రెసెంటేషన్ ఫిదా అయిన క్లైంట్స్.. అందరి ముందు పొంగుతూ ఉంటారు. ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు. రాజ్ రాగానే.. మీటింగ్ పెట్టుకొని ఎక్కడికి వెళ్లావని సుభాష్ అడుగుతాడు. కావ్య వల్లే ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చింది అని రాజ్ ముందు కావ్యను మెచ్చుకుంటాడు. మరో వైపు రాజ్ పక్కన.. శ్వేతను గమనించిన సుభాష్.. ఈ అమ్మాయి ఎవరని అడుగుతాడు.

publive-image
సుభాష్ అలా అడగగానే.. ఆ అమ్మాయి అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ పెదనాన్న అని కళ్యాణ్ చెప్తాడు. అంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాకు ఎప్పుడు చెప్పలేదే అని అంటాడు సుభాష్. ఇంతలో కావ్య.. తాను రోజు ఆఫీస్ కు వస్తుంది కానీ.. మీరు పైన ఉంటారు కద మావయ్య అందుకే మీకు కనిపించదు అంటూ రాజ్ ను ఇరికించే ప్రయత్నం చేస్తుంది.

publive-image
మరో వైపు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న అప్పు .. తన చదువు కోసం అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో కనకం, మూర్తి అక్కడికి వస్తారు. మూర్తి ఏం పుస్తకాలు కావాలని అడుగుతాడు. దానికి అప్పు నా గురించి మీరు టెన్షన్ పడకండి నాన్న.. అన్నీ నేను చూసుకుంటానని చెబుతుంది.

publive-imageమరో వైపు ఇంటి తాళాలు దొంగతనం చేసిన అనామిక, రుద్రాణి కావ్య పై నిందమోపే ప్రయత్నం చేస్తారు. అనామిక.. కావ్య ఇంటి తాళాలు బెడ్ రూమ్ లో పడేసి వెళ్ళిపోయింది అని అపర్ణకు చెప్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి.. ఇంటి బాధ్యతలు ఇచ్చిన ఒక్క రోజుకే ఇంత నిర్లక్ష్యం ఏంటని వెటకారంగా మాట్లాడుతుంది.

publive-image
ధాన్యలక్ష్మి ఎన్ని మాటలు చెప్పినా సరే అపర్ణ మాత్రం కోడలికి సపోర్ట్ గా మాట్లాడుతుంది. ధాన్యలక్ష్మి వెటకారం పై ఫైర్ అవుతుంది. కావ్య ఏదో కంగారులో మర్చిపోయింది అంతే కానీ.. తాను ఎలాంటి తప్పు చేయదని ధాన్యలక్ష్మికి గడ్డి పెడుతుంది.

publive-imageఅపర్ణ ఇలా మాట్లాడడంతో అనామిక, రుద్రాణి షాక్ అవుతారు. కోడల్ని తిడుతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటని మొహాలు మాడ్చుకుంటారు. ప్లాన్ వర్క్ ఔట్ కాలేదని అనామిక రగిలిపోతూ ఉంటుంది. నేను ఎప్పడికీ ఈ దాసోహం చేయాల్సిందేనా అని మనసులో అనుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Valentines Day Re-Release Movies: వాలెంటైన్స్ డే స్పెషల్.. రీ రిలీజ్ కాబోతున్న సూపర్ హిట్ లవ్ స్టోరీస్

#brahmamudi-serial-today-episode
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి