Brahmamudi Serial : రుద్రాణి, అనామికల కుట్రకు బలైన కావ్య.. భార్యకు విడాకులు ఇవ్వబోతున్న రాజ్

రాజ్.. కావ్య ముందే కావాలనే శ్వేతను ఎత్తుకుని ఆనందంతో.. విడాకులు తీసుకుంటానని చెప్తాడు. ఇది విన్న కావ్య మనసు ముక్కలైపోతుంది. మరో వైపు రుద్రాణి, అనామిక లాకర్ నుంచి డబ్బులు దొంగతనం చేసి.. కావ్య పై నిందమోపే ప్లాన్ చేస్తారు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Brahmamudi Serial : రుద్రాణి, అనామికల కుట్రకు బలైన కావ్య.. భార్యకు విడాకులు ఇవ్వబోతున్న రాజ్
New Update

Brahmamudi Serial Today Episode :  భార్య అనామిక(Anamika) కోసం కళ్యాణ్(Kalyan) ఆఫీస్ కు వెళ్ళడానికి రెడీ అవుతాడు. కళ్యాణ్ గెటప్ చూసి అందరు షాక్ అవుతారు. ఏంటీ రా కొత్తగా ఆఫీస్ కు వస్తున్నావు అని కళ్యాణ్ ను అడుగుతాడు. పెళ్ళైన తర్వాత కొన్ని తప్పవు అన్నయ్య అంటూ కళ్యాణ్ వెటకారం చేస్తాడు.

Anamika & Kalyan - Brahmamudi Serial

రాజ్ అలా అడగడంతో తట్టుకోలేని ధాన్యలక్ష్మి(Dhanya Lakshmi).. నువ్వు, నీ భార్య మాత్రమే ఆఫీస్ కు వెళ్తారా..? నా కొడుక్కి ఆఫీస్ కు వచ్చే హక్కు లేదా అని వెటకారంగా మాట్లాడుతుంది. దాంతో కావ్య ఇది హక్కుల గురించి కాదు.. కళ్యాణ్ కు కలం తప్ప మరో ద్యాస ఉండదు కదా.. నిజంగానే ఆఫీస్ రావడం ఇష్టమేనా అని ఆయన ఉద్దేశం అంటూ భర్త మాటలకు వివరణ ఇస్తుంది.

Dhanya Lakshmi

మొదటిసారి ఆఫీస్ కు వెళ్తున్న కళ్యాణ్ పెద్దమ్మ అపర్ణ ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత కావ్యతో పాటు కారులో ఆఫీస్ కు వస్తానని అడుగుతాడు. నేను మీ అన్నయ్యను ఫాలో అవ్వడానికి వెళ్తున్నాని కావ్య చెప్పడంతో.. వేరే కారులో వస్తానని చెబుతాడు. ఇది తెలియని ధాన్యలక్ష్మీ కావ్యను అపార్థం చేసుకొని తిడుతుంది. నీకు వేరే వాళ్ళ కారులో వెళ్లాల్సిన అవసరం లేదు.. మన కారు తీసుకెళ్ళు అని తాళాలు ఇస్తుంది.

Aparna - Kalyan

రాజ్, కావ్య ఇద్దరు ఆఫీస్ కు బయలుదేరుతారు. రాజ్ శ్వేత ఇంటికి వెళ్తున్నాడని తెలిసిన కావ్య రాజ్ కారును వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది. కావ్య ఫాలో అవ్వడం గమనించిన రాజ్.. ఈరోజు నీకు దిమ్మతిరిగే షాక్ ఇస్తానులే అని మనసులో అనుకుంటాడు.

Raj - Kavya

మరో వైపు కావ్య నుంచి ఇంటి తాళాలు దొంగలించిన రుద్రాణి, అనామిక.. లాకర్ నుంచి డబ్బులు కొట్టేసి.. కావ్య పై నిందమోపే ప్లాన్ వేస్తారు. రుద్రాణి వెళ్లి లాకర్ నుంచి డబ్బు కొట్టేసి అనామిక చేతికి ఇస్తుంది.

Rudhrani

ఆ తరువాత రుద్రాణి తాళాలు తీసుకెళ్లి ధాన్యలక్ష్మికి ఇస్తానని అనామికతో చెబుతుంది. వెంటనే అనామిక మీరు ఇస్తే డౌట్ వస్తుంది.. నేను వెళ్లి ఇస్తానని ప్లాన్ వేస్తుంది. అనామిక తెలివితేటలు గమనించిన రుద్రాణి.. అసలు నువ్వు ఈ ఇంటికి ఎందుకొచ్చావు అని అనుమానంతో అడుగుతుంది. దాంతో అనామిక అదేం లేదు ఆంటీ.. కళ్యాణ్ ఇంటికి రాజు అవ్వాలి .. నేను రాణి అవ్వాలి అందుకే ఇదంతా అని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.

Anamika

ఇటు శ్వేతను కలవడానికి రాజ్ వస్తాడు. రాజ్ రాగానే శ్వేత వచ్చి.. నీకు గుడ్ న్యూస్ నా భర్త విడాకులకు ఒప్పుకున్నాడని చెబుతుంది. వీళ్ళిద్దరిని కావ్య చూడడం గమనించిన రాజ్.. కావాలనే శ్వేతను ఎత్తుకొని తిప్పుతాడు. మనకు ఎలాంటి అడ్డు లేదు.. నీకు విడాకులు వచ్చాయి. నాకు కూడా త్వరలోనే వస్తాయి అని కావ్యకు వినిపించేలా గట్టిగా మాట్లాడతాడు. కావ్య నీ భర్తలా శాడిస్ట్ కాదు.. వెంటనే విడాకులు ఇస్తుంది. అప్పుడే మనం పెళ్లి చేసుకుందామని శ్వేతతో అంటాడు రాజ్. ఇది చూసిన కావ్య మనసు ముక్కలైపోతుంది. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Swetha - Raj v/s Kavya

కావ్య వెళ్ళగానే రాజ్, శ్వేత లోపలికి వెళ్తారు. రాజ్.. కావ్య చాలా మంచి అమ్మాయి ఇలాంటి భార్య దొరకడం కష్టం. కావ్యను ఇలా మోసం చేయడం తప్పు అని నిలదీస్తుంది శ్వేతా. కావ్యకు విడాకులు ఇవ్వొద్దని రాజ్ కు సలహా ఇస్తుంది.

Raj - Swetha

శ్వేత ఎంత చెప్పినా కూడా రాజ్ మాత్రం వినిపించుకోడు. కావ్య మంచి కోసమే నేను విడాకులు ఇస్తున్నాను.. నాతో ఉంటే సంతోషంగా ఉండలేదు. నేను విడాకులు ఇస్తే తనకు నచ్చినట్లు బ్రతుకుతుంది.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నని శ్వేతతో చెబుతాడు రాజ్. శ్వేత మాత్రం కావ్య గురించి గొప్పగా చెప్తూ రాజ్ మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది.

Raj - Swetha

ఆఫీస్ లో.. రాజ్ క్లైంట్ మీటింగ్ అటెండ్ అవ్వలేదని సుభాష్ అందరి పై ఫైర్ అవుతూ ఉంటాడు. ఇంతలో కావ్య ఆఫీస్ కు వస్తుంది. రాజ్, నువ్వు కలిసే వచ్చారు కదా.. తను ఎక్కడ అని కావ్యకు అడుగుతాడు శుభాష్. నేను స్ట్రయిట్ గా వచ్చాను.. తను అడ్డదారిలో వెళ్ళాడు అని కావ్య చెబుతుంది. అడ్డదారిలో ఏ అడ్డమైన పనులు చేస్తున్నాడు అంటూ రాజ్ పై సుభాష్ సీరియస్ అవుతాడు. మీకు అసలు నిజం తెలిస్తే ఊరుకోరు మావయ్య అని కావ్య మనసులో అనుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Subhash

Also Read: Buchi Babu: రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో

#tv-serial #daily-serial #tv-show #brahmamudi-serial-today-episode
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe