Brahmamudi Today Episode: పరాయి అమ్మాయితో సంబంధం పై భర్తను నిలదీసిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు

భర్త రాజ్ ఇంటికి రాగానే శ్వేతతో ఉన్న సంబంధం గురించి నిలదీస్తుంది కావ్య. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఎప్పటికైనా మనం విడిపోవాల్సిందే అని రాజ్.. కావ్య పై గట్టిగా అరుస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

Brahmamudi Today Episode: పరాయి అమ్మాయితో సంబంధం పై భర్తను నిలదీసిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు
New Update

Brahmamudi Today Episode: భర్త రాజ్ ను శ్వేత ఇంట్లో చూసిన కావ్య గుండె నిండ బాధతో కనీళ్ళు పెట్టుకుంటుంది. భర్త చేసిన పనిని తట్టుకోలేకపోతున్న కావ్య.. అదే ఆలోచనలతో ఒంటరిగా రోడ్డు పై నడుస్తూ ఇంటికి వెళ్తుంది.publive-imageరాజ్ ఆలోచనలతో పరధ్యానంగా ఇంట్లోకి వెళ్తున్న కావ్యను చిన్న కోడలు అనామిక ఆపేస్తుంది. బాధలో ఉన్న కావ్యను నాకు వంట నేర్పించు అని అడుగుతుంది. కావ్య నాకు ఇప్పుడు ఓపిక లేదని చెప్పిన వినకుండా విసిగిస్తుంది. దీంతో కావ్య.. ఒకసారి చెప్తే అర్థం కాదా అని అనామిక పై అరుస్తుంది.

publive-imageఇది గమనించిన అనామిక అత్త ధాన్యలక్ష్మి .. ఏంటీ ఒక్క రోజు ఆఫీస్ కు వెళ్ళగానే ఇంత అహంకారం పెరిగిపోయిందా..? అని కావ్యను తిట్టడం మొదలు పెడుతుంది. తట్టుకోలేకపోయిన కావ్య.. నేను ఏమైనా మీ పని మనిషినా నా పై ఇష్టం వచ్చినట్లు అరుస్తున్నారు అని ధాన్యలక్ష్మి పై ఫైర్ అవుతుంది.

publive-imageచిన్న అత్తా , చిన్న కోడళ్ళు కలిసి కావ్య పై అరవడం గమనించిన అపర్ణ.. ధాన్యలక్ష్మి , అనామికను దిమ్మతిరిగే వార్నింగ్ ఇస్తుంది. ఏంటీ నా కోడలు పై అరుస్తున్నావు. నా కోడలు ఈ ఇంటి పని మనిషి అనుకున్నావా..? ఇక నుంచి నువ్వు, నీ కోడలే వంట చేయాలనీ అత్తా కోడళ్ల దుమ్ము దులిపేసింది అపర్ణ.

publive-imageరూమ్ లోకి వచ్చిన కావ్య ఒంటరిగా కూర్చొని.. తన భర్త చేసిన మోసం గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. శ్వేత కోసం రాజ్ తనతో చెప్పిన అబద్దాలను తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో కావ్యను అలా చూసిన కళ్యాణ్ రూమ్ లోకి వస్తాడు.

publive-image

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

కావ్య దగ్గరకు వచ్చిన కళ్యాణ్.. ఏమైంది అంటూ వదినను అడుగుతాడు. రాజ్ గురించి వదిన చెప్పిన నిజాన్ని విన్న కళ్యాణ్ షాక్ అవుతాడు. మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే సరిపోదు. అన్నయ్య మీకు చేసిన మోసం గురించి నిలదీయండి.. మీ భవిష్యత్తు ఏంటని ప్రశ్నించండి అంటూ వదినకు దైర్యం చెప్తాడు కళ్యాణ్.

publive-imageభర్త రాజ్ రూమ్ లోకి రాగానే ఇంత సేపు ఎక్కడికి వెళ్లారని నిలదీస్తుంది కావ్య. నా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అంటూ కావ్య పై సీరియస్ అవుతాడు రాజ్. దాంతో కావ్య మీరు తాళి కట్టిన భార్యను.. మీరు రహస్యంగా కలుసుకునే శ్వేతను కాదని చెప్తుంది.

publive-imageఇది వినగానే ఒక్కసారిగా రాజ్ షాకవుతాడు. మీరు ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో గడుపుతున్నారో అంతా నాకు తెలుసు అని రాజ్ కు దిమ్మతిరిగే షాకిస్తుంది కావ్య. దాంతో రాజ్.. నేను ఎక్కడికి వెళ్తున్నాను , ఏం చేస్తున్నానని ఫాలో అవుతున్నావా అంటూ కావ్య పై ఫైర్ అవుతాడు.

publive-image

మీరు పరాయి వాళ్ళ వెంట తిరిగితే తప్పులేనప్పుడు.. నేను భర్త వెనుక తిరిగితే తప్పేంటి అని రాజ్ ను గట్టిగా నిలదీస్తుంది. దీంతో రాజ్ మనం ఎప్పడికైనా విడిపోవాల్సిందే అంటూ కావ్యకు వార్నింగ్ ఇస్తాడు. ఇది విన్న కావ్య కన్నీళ్లతో ఎందుకు విడిపోవాలి చెప్పండి అని భర్తను నిలదీస్తుంది. ఇక రాజ్ ఏం చెబుతాడో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.

publive-image

Also Read: Brahmamudi Serial: ఆఫీస్ లోకి కావ్య గ్రాండ్ ఎంట్రీ .. కుళ్ళుకొని చస్తున్న అత్తాకోడళ్ళు

#brahmamudi-serial
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe