Brahmamudi Serial: దుగ్గిరాల వారసుడిగా తప్పుకుంటున్న రాజ్.. భర్త నిర్ణయాన్ని వ్యతిరేకించిన కావ్య..! ఆనందంలో అనామిక, ధాన్యలక్ష్మి

కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకున్న రాజ్ పవర్ ఆఫ్ అటార్నీ తమ్ముడు కళ్యాణ్ పేరు పై రాయాలని నిర్ణయించుకుంటాడు. దీంతో ఇంట్లో అందరు షాక్ అవుతారు. మరో వైపు భార్య కావ్య కూడా రాజ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ సాగుతోంది.

New Update
Brahmamudi Serial: దుగ్గిరాల వారసుడిగా తప్పుకుంటున్న రాజ్.. భర్త నిర్ణయాన్ని వ్యతిరేకించిన కావ్య..! ఆనందంలో అనామిక, ధాన్యలక్ష్మి

Brahmamudi Serial: కొడుకును రాహుల్ ను జెనరల్ మేనేజర్‌ చేయాలని నిర్ణయించుకున్న రుద్రాణి. రాహుల్ తో కలిసి కొత్త నాటకం మొదలు పెడుతుంది. దీంట్లో భాగంగా అనామికను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అనామిక తనను తిట్టమని కొడుకు రాహుల్ కు చెప్తుంది.

publive-image

ఇక అనామిక రావడం గమనించిన రాహుల్.. తల్లి రుద్రాణిని తిట్టడం మొదలు పెడతాడు. ఏ తల్లి అయినా కొడుకును గొప్ప పొజిషన్ లో చూడాలనుకుంటుంది. కానీ నువ్వు మాత్రం నన్ను ఇంకా బానిసలనే ఉండమని చెబుతున్నావు. ఆ ఎండీ సీట్ కూడా కళ్యాణ్ కు దక్కేలా చేశావు. అసలు నువ్వు నా తల్లివేనా అని రుద్రాణి పై కోప్పడి వెళ్ళిపోతాడు.

publive-image
ఇందంతా విన్న అనామిక రుద్రానికి దగ్గరకు వస్తుంది. అనామిక రాగానే.. కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతున్నట్లు నటిస్తుంది రుద్రాణి. ఇందంతా నిజమని నమ్మిన అనామిక.. రాహుల్, రుద్రాణి నాటకంలో పావులా మారుతుంది. కళ్యాణ్ తో చెప్పి రాహుల్ జెనరల్ మేనేజర్‌ అయ్యేలా చేస్తానని మాటిస్తుంది.

publive-image
మరో వైపు బాబు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. దీంతో రాజ్ బాబును ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తాడు. ఊరుకో నాన్న .. అమ్మ వస్తుంది.. పాలు ఇస్తుంది అని చెప్తాడు.

publive-image

ఇది విన్న కావ్య రాజ్ పై కోపంతో అరుస్తుంది. నేను వాడికి అమ్మను ఎలా అయ్యాను అని గొడవ చేస్తుంది. కావాలంటే మీ నాన్న పెళ్ళాం అని పరిచయం చేయండి.. అంతే కానీ నన్ను వాడికి అమ్మను చేస్తే మాత్రం ఊరుకోను అని రాజ్ కు గట్టిగా ఇస్తుంది.

publive-image
ఆ తర్వాత దుగ్గిరాల ఇంటికి లాయర్ వస్తాడు. లాయర్ రాగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇంతలో అక్కడికి వచ్చిన రాజ్.. లాయర్ ను తానే పిలిచానని చెప్తాడు. ఎందుకని ఇంట్లో వాళ్ళు అడగగా.. తాను కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకున్న కారణంగా పవర్ ఆఫ్ అటార్నీ తమ్ముడు కళ్యాణ్ పేరు పై రాయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతాడు. కానీ దీనికి ఇంట్లో వారంతా ఒప్పుకోరు. ఇదంతా ఆ బిడ్డ కారణంగానే అని కొడుకు రాజ్ పై కోప్పడుతుంది అపర్ణ.

publive-image

మరో వైపు భార్య కావ్య కూడా దీనికి అంగీకరించదు.  తన భర్తను ఎలాంటి స్థాయి లేకుండా ఒక అనామకుడిలా చూడలేనని. రాజు ఎప్పుడూ సింహాసనం పైనే ఉండాలి. పరివారం మధ్యలో కాదని భర్త గురించి గొప్పగా చెబుతుంది కావ్య. దీంతో రాజ్ తో పాటు ఇంట్లో అందరు ఎమోషనల్ అవుతారు. నేటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Ram Charan- Upasana: క్లింకారతో రామ్ చరణ్ థైలాండ్ వెకేషన్.. వైరలవుతున్న ఫొటోలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు