Brahmamudi Serial : బిడ్డ తల్లి ఎవరో బయట పెట్టిన రాజ్.. కావ్య ఏం చేయనుంది..? దుగ్గిరాల వారసుడిగా కళ్యాణ్ బాధ్యతలు..!

రాజ్ తర్వాత కోడలు కావ్యకు ఎండీ పదవి అప్పగించాలని నిర్ణయించుకుంటాడు సుభాష్. కానీ కావ్య దీనికి అంగీకరించదు. రాజ్ స్థానంలో కూర్చునే అర్హత వారసుడిగా కళ్యాణ్ కు మాత్రమే ఉందని చెప్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Brahmamudi Serial : బిడ్డ తల్లి ఎవరో బయట పెట్టిన రాజ్.. కావ్య ఏం చేయనుంది..? దుగ్గిరాల వారసుడిగా కళ్యాణ్ బాధ్యతలు..!
New Update

Brahmamudi Serial Today Episode : రాజ్(Raj) కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. ఆ తర్వాత ఎండీ స్థానంలో ఎవరు కూర్చోవాలి అనే విషయం పై ఇంట్లో రచ్చ మొదలవుతుంది. భర్త కళ్యాణే(Kalyan) ఎండీ కావాలని పట్టుబడుతుంది అనామిక(Anamika).

Raj - Kalyan - Anamika

మరో వైపు స్వప్న(Swapna) .. ఏ మాత్రం బిజినెస్ పై ఇంట్రెస్ట్ లేని కళ్యాణ్ కంటే.. తన భర్త రాహుల్(Rahul) ఎండీ సీట్ కు అర్హుడని వాదిస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సుభాష్.. అందరూ మాట్లాడడం ఆపేస్తే, తాను మాట్లాడతానని అంటాడు.

Swapna
సుభాష్ ఇంట్లో అందరి ముందు తన నిర్ణయాన్ని బయట పెడతాడు. రాజ్ తర్వాత ఆ ఎండీ స్థానంలో కూర్చునే అర్హత కేవలం కావ్యకు మాత్రమే ఉందని చెప్తాడు. సుభాష్ నిర్ణయంతో రుద్రాణి, అనామికల దిమ్మతిరుగుతుంది. కళ్యాణ్, ఇందిరాదేవి, సీతారామయ్య చాలా సంతోషపడతారు.

Subhash - Kavya
కావ్య మాత్రం అందరికీ పెద్ద షాకిస్తుంది. తన భర్త స్థానాన్ని తీసుకోవడం ఇష్టం లేదని చెప్తుంది. దీంతో సుభాష్ ఎందుకని అడుగుతాడు. నా భర్త నిజంగానే తప్పు చేశాడని ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అలాంటప్పుడు ఆయనను ఎండీ పదవి నుంచి తప్పించి.. ఆ సీట్ లో నేను కూర్చుంటే.. మీతో పాటు తనను నేను కూడా కించ‌ప‌రిచిన‌ట్లు అవుతుంది అని భర్తకు సపోర్ట్ గా మాట్లాడుతుంది. తనకు అన్యాయం చేశాడని తెలిసి కూడా కావ్య ఇలా మాట్లాడడంతో ఎమోషనల్ అవుతాడు రాజ్.

Kavya - Raj
ఆ తర్వాత గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఇంతలో అక్కడికి వచ్చిన కావ్య.. బాబు గురించి రాజ్ తో గొడవ పడుతుంది. అసలు ఆ బాబు తల్లి ఎవరని భర్తను నిలదీస్తుంది. కానీ రాజ్ మాత్రం పదే పదే ఆ టాపిక్ ఎందుకు తీస్తావు అని కావ్య పై సీరియస్ అవుతాడు.

Raj - Kavya
దీంతో కావ్య.. ఇప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్పాలని పట్టుబడుతుంది. కనీసం ఆ బిడ్డ తల్లి పేరైన చెప్పండి అని అంటుంది. భార్య పట్టుబట్టడంతో అసలు నిజం చెప్పేస్తాడు రాజ్. బిడ్డ తల్లి పేరు వెన్నెల అని చెప్తాడు.

Raj - Kavya - Vennela
మరో వైపు కళ్యాణ్(Kalyan) అప్పు(Appu) కు ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ ఆమె ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో కావ్య వస్తుంది. ఎండీగా ఎంపికైనందుకు కళ్యాణ్ కు అభినందనలు తెలియజేస్తుంది. మీకు డబ్బు సంపాదించ‌డం రాదని.. చేత‌కానివాడిగా జమకట్టిన వారికి.. మీరేంటో ప్రూవ్ చేసి చూపించాలని మరిదికి సలహా ఇస్తుంది.

Kalyan
దీంతో కళ్యాణ్ బిజినెస్ పై ఫోకస్ పెట్టాలంటే.. మీ సహాయం కావాలని కావ్యను అడుగుతాడు. ఇక కావ్య వ‌దిన‌లా కాదు, అమ్మ‌లా మీకు ఎల్లప్పుడూ స‌పోర్ట్‌గా ఉంటాన‌ని క‌ళ్యాణ్‌కు మాటిస్తుంది. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Kalyan - Kavya

Anupama : వావ్..! నవ్వుతో పడేస్తున్న టిల్లు బ్యూటీ.. చీరలో అందాల హొయలు

#brahmamudi-serial #brahmamudi-serial-today-episode
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe