Brahmamudi Serial: రాజ్ ప్లాన్ అదిరింది.. భార్యను ఎండీ చేయాలని నిర్ణయం..! షాక్ లో అపర్ణ

తన తర్వాత ఎండీ సీట్ లో కూర్చునే అర్హత కావ్యకు మాత్రమే ఉందని తండ్రి సుభాష్ కు సలహా ఇస్తాడు రాజ్. మరో వైపు రుద్రాణి, అనామిక ఎండీ సీట్ దక్కించుకోవాలని ప్లాన్ చేస్తారు. దీని కోసం ఇంట్లో అందరి ముందు పంచాయితీ పెడతారు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: రాజ్ ప్లాన్ అదిరింది.. భార్యను ఎండీ చేయాలని నిర్ణయం..! షాక్ లో అపర్ణ

Brahmamudi Serial: బాబు కారణంగా ఇంట్లో జరిగిన గొడవను గుర్తుచేసుకుంటారు కావ్య, ఇందిరాదేవి. ఆ బాబు సమస్య రోజు రోజుకు పెద్దదవుతోంది అని కావ్యతో బాధపడుతుంది ఇందిరాదేవి. మరో వైపు కావ్య.. తన ప్రాణ స్నేహితురాలైన శ్వేతకు కూడా నిజం తెలియకుండా దాచాడంటే ఏదో రహస్యం ఉంది అని అనుమానపడుతుంది. ఎలాగైనా నిజాన్ని బయట పెట్టించాలని అనుకుంటుంది.

publive-image

తండ్రికి చెప్పకుండా ఎండీ బాధ్యతల నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకున్నందుకు సుభాష్‌కు క్షమాపణలు చెప్తాడు రాజ్. నా పై నమ్మకంతో కంపెనీ బాధ్యతలు అప్పగించారు. కానీ మీ నమ్మకాన్ని బ్రేక్ చేశానని తండ్రితో ఎమోషనల్ అవుతాడు రాజ్.

publive-image
ఆ తర్వాత.. త‌న స్థానంలో ఎండీగా ఎవ‌రిని చేయాల‌ని అనుకుంటున్నార‌ని సుభాష్‌ను అడుగుతాడు రాజ్‌. ఇంకా ఎవరినీ అనుకోలేదని చెప్తాడు సుభాష్. దీంతో రాజ్.. కళ్యాణ్ చేద్దాం అంటే తనకు ఇంట్రెస్ట్ లేదు.. ఇక రాహుల్ కు అసలు బాధ్యతే లేదు.. అందుకే నా తర్వాత ఎండీ సీట్ లో కూర్చునే అర్హత ఒక్క కావ్య మాత్రమే ఉందని తండ్రికి సలహా ఇస్తాడు.

publive-image
కావ్య నా భార్య అని నేను ఈ మాట చెప్పట్లేదు. ఎంత పెద్ద క‌ష్టం వ‌చ్చిన‌ ఎదుర్కొనే కెపాసిటీ తనకు ఉంది అని భార్యకు సపోర్ట్ గా మాట్లాడతాడు రాజ్. సుభాష్ కూడా కావ్యనే ఎండీ చేయాలని నిర్ణయించుకుంటాడు.

publive-image
మరో వైపు కావ్య.. బాబుతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజ్ వస్తాడు. భర్త రాగానే.. ఏంటీ కాంప్రమైజ్ అయ్యానని అనుకుంటున్నారా అని వెటకారంగా మాట్లాడుతుంది కావ్య. ఆ తర్వాత కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకొని..తప్పు చేశారని రాజ్ పై కోప్పడుతుంది కావ్య. ఇక రాజ్ మాత్రం.. కంపెనీలో నేను లేని లోటు నువ్వే తీరుస్తావనే నమ్మకం నాకు ఉంది అని మనసులో అనుకుంటాడు.

publive-image
ఎలాగైనా కంపెనీ బాధ్యతలు దక్కించుకోవాలని అనామికను రెచ్చగొడుతుంది రుద్రాణి. క‌ళ్యాణ్‌ను ఎండీ సీట్‌లో కూర్చోబెట్టడానికి ఇదే సరైన సమయం అని అనామికకు  చెప్తుంది. తన భర్తను ఎండీ సీట్‌లో కూర్చునేలా అప‌ర్ణ‌ను ఒప్పించ‌మ‌ని అనామిక‌ను రెచ్చగొడుతుంది. publive-image

రుద్రాణి మాటలకు పడిపోయిన అనామిక.. అపర్ణ దగ్గరకు ఆవేశంగా వెళ్తుంది. మరో వైపు కొడుకు రాహుల్ ను ఎండీ చేయాలనుకున్న రుద్రాణి అటు స్వప్నను కూడా రెచ్చగొట్టి పంపిస్తుంది. దీంతో కళ్యాణ్ ఎండీ కావాలని అనామిక, రాహుల్ ఎండీ కావాలని స్వప్న సుభాష్, అపర్ణతో గొడవపడతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో రాజ్ నిర్ణయం ప్రకారం కావ్యను ఎండీ గా ప్రకటించి షాకిస్తాడు సుభాష్

publive-image

Also Read: Tillu Square: “ఇది యూనివర్సల్ సినిమా”.. ‘టిల్లు స్క్వేర్‌’ పై మెగాస్టార్‌ రియాక్షన్‌ ఏంటో చూడండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు