Brahmamudi Serial: దుగ్గిరాల ఇంటి పరువు కాపాడాలని భావించిన కావ్య.. మీడియా ముందు బాబు తల్లి తనేనని చెబుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన అపర్ణ రాజ్ చేసిన తప్పు కారణంగా మీడియా ముందు పరువు పోయిందని కోపంతో రగిలిపోతుంది. బిడ్డ తల్లి ఎవరో రెండు రోజుల్లో బయటపెట్టాలని.. లేదంటే ఇంటి నుంచి మెడపట్టి గెంటేస్తానని కొడుకు రాజ్ కు వార్నింగ్ ఇస్తుంది.
మరో వైపు బాబు తల్లి తానే అని చెప్పినందుకు కావ్య పై కూడా విరుచుకుపడుతుంది అపర్ణ. వాడు నీ బిడ్డ అని ఎలా చెప్పావు. ఇంటి వారసుడు అని ఎలా అంటావు.. నీకే ఈ ఇంట్లో దిక్కు, స్థానం లేదు. అలాంటిది నువ్వు ముందుకు వచ్చి అబద్దం ఎందుకు చెప్పావు అని కోడలి పై అరుస్తుంది అపర్ణ.
ఆ తర్వాత అత్త అపర్ణకు గట్టిగా సమాధానం చెప్తుంది కావ్య. మీరన్నది నిజమే ఇప్పటికీ నాకు కోడలిగా ఈ ఇంట్లో స్థానం లేదు, మాట్లాడే అర్హత కూడా లేదని మర్చిపోయి ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పాను. మరి మీరెందుకు నిజం చెప్పలేదు. మీ కొడుకు చేసిన తప్పును బయటపెట్టలేదు అని గట్టిగా బదులిస్తుంది. దీంతో అపర్ణ షాకవుతుంది.
మరో వైపు రాహుల్, రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన కావ్య.. మీరు మనుషులేనా.. ఇంటి పరువు తీస్తే మీ పరువు కూడా పోతుందని తెలియదా..? మీడియా వాళ్ళను ఎందుకు పిలిచారు అని వాళ్లకు గడ్డిపెడుతుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన స్వప్న కూడా రాహుల్, రుద్రానికి గట్టిగానే క్లాస్ ఇస్తుంది. వీళ్లు గోతికాడా నక్కలు. అవి చనిపోతేనే పీక్కుతింటాయి కానీ వీళ్ళు బ్రతికుండగానే హింసిస్తారు అని దుమ్ముదులిపేస్తుంది.
అప్పు ముందు భర్త కళ్యాణ్ తన చెంప పగలగొట్టడం తట్టుకోలేకపోతున్న అనామిక కోపంతో రగిలిపోతుంది. అప్పు ముందు పరువు పోయిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో అక్కడి వచ్చిన రుద్రాణి అనామికను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. కళ్యాణ్, అప్పు పై పోలీస్ కేసు పెట్టి పరువు తీయమని చెప్తుంది. నేటితో ఎపిసోడ్ ముగుస్తుంది.